Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయుల డెన్‌గా జో బైడెన్ అధికారిక బృందం!

భారతీయుల డెన్‌గా జో బైడెన్ అధికారిక బృందం!
, సోమవారం, 18 జనవరి 2021 (07:19 IST)
అమెరికా 46వ అధ్యక్షుడుగా జోబైడెన్ ఈ నెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, బైడెన్ బృందంలో అధిక సంఖ్యలో భారతీయులు కొలువుదీరడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. భారత సంతతి వ్యక్తులు శ్వేతసౌధంలో, కీలక ప్రభుత్వ పదవుల్లో నియమితులయ్యారు. ఒకరా, ఇద్దరా .. ఏకంగా 20 మంది ఇండో-అమెరికన్ పౌరులు కీలక బాధ్యతల్లో నియమితులయ్యారు. ఇది అమెరికా చరిత్రలోనే తొలిసారి. 
 
ఇప్పటికే ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ భారతీయ మూలాలున్నవారే. ఆమెనే కాక - తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారతీయ సంతతికి చెందిన ప్రముఖులను తన బృందంలోకి తీసుకుంటానని బైడెన్‌ గతంలోనే వెల్లడించారు. అగ్రశ్రేణి పదవులకు ఎంపికైన ప్రముఖుల్లో నీరా టాండన్‌ ఒకరు. ఈమె ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1988 నుంచి 2016 దాకా ప్రతీ డెమొక్రాట్‌ అధ్యక్ష అభ్యర్థి ప్రచారంలోనూ ఆమెది కీలకపాత్ర. డెమొక్రాట్‌ ప్రభుత్వాల్లో విధానపరమైన సలహాదారుగా కేపిటల్‌  హిల్‌లో పనిచేసిన విశేషానుభవం ఉన్న వ్యక్తి. 
 
ఇక బైడెన్‌ ఎంపిక చేసుకున్న వ్యక్తి డాక్టర్‌ వివేక్‌ మూర్తి. అమెరికా సర్జన్‌ జనరల్‌గా నియమితులవుతున్నారు. ఆరోగ్యరంగ నిపుణుడిగా ఆయన వ్యాక్సినేషన్‌ విషయంలో దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కొవిడ్‌ టెస్టింగ్‌ విభాగం వ్యవహారాలను చూసే బాధ్యతను డాక్టర్‌ విదుర్‌ శర్మకు అప్పగించారు. 
 
ఇకపోతే, బైడెన్‌ వెలువరించే ప్రసంగాలన్నింటినీ పకడ్బందీగా రాసే బాధ్యత వినయ్‌రెడ్డిది. స్పీచ్‌ డైరెక్టర్‌గా ఆయన నియమితులయ్యారు. అధ్యక్ష సిబ్బంది కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌గా గౌతమ్‌ రాఘవన్‌ ఎంపికయ్యారు. ప్రస్తుతం బైడెన్ టీమ్‌లో చోటు దక్కించుకున్న భారతీయుల వివరాలను పరిశీలిస్తే, 
 
వేదాంత్‌ పటేల్‌... అధ్యక్షుడికి సహాయ ప్రెస్‌ సెక్రటరీ
సబ్రీనా సింగ్‌... డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ, వైట్‌హౌస్‌
వనితా గుప్తా... అదనపు అటార్నీ జనరల్‌
ఉజ్రా జెయా... అండర్‌ సెక్రటరీ, పౌర భద్రత, మానవహక్కులు
మాలా అడిగా... ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు విధాన సలహాదారు, డైరెక్టర్‌
అయిషా షా... పార్ట్‌నర్‌షిప్‌ మేనేజర్‌, వైట్‌హౌస్‌ డిజిటల్‌ స్ట్రాటజీ
సమీరా ఫజిలీ... డిప్యూటీ డైరెక్టర్‌, అమెరికా నేషనల్‌ ఎకనామిక్‌ కౌన్సిల్‌
భరత్‌ రామమూర్తి... డిప్యూటీ డైరెక్టర్‌, నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌
తరుణ్‌ ఛాబ్రా... సీనియర్‌ డైరెక్టర్‌, టెక్నాలజీ, నేషనల్‌ సెక్యూరిటీ
సుమోనా గుహా... దక్షిణాసియా వ్యవహారాల సీనియర్‌ డైరెక్టర్‌
శాంతి కళాథిల్‌... ప్రజాస్వామ్యం, మానవహక్కుల విభాగాల సమన్వయకర్త
నేహా గుప్తా... వైట్‌హౌస్‌ న్యాయవాద బృందంలో అదనపు సీనియర్‌ కౌన్సెల్‌ 
సోనియా అగర్వాల్‌... పర్యావరణ విధాన సీనియర్‌ సలహాదారు
గరిమా వర్మ... ప్రథమ మహిళకు డిజిటల్‌ డైరెక్టర్‌
రీమా షా.... డిప్యూటీ అసోసియేట్‌ కౌన్సెల్‌ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీకా వేసుకున్నా కరోనా వైరస్ సోకదన్న గ్యారెంటీ లేదు : సీరమ్ ఇనిస్టిట్యూట్