Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాల్పుల ఘటనపై బాధపడలేదు కానీ, ట్రంప్‌ను సమర్థించడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తారా?

అమెరికాలోని కాన్సస్ ప్రాంతంలో తెలుగు యువకులపై జరిగిన కాల్పులపై నిరసనలు చెలరేగుతూనే ఉన్నాయి. వలస ప్రజలపై వ్యతిరేకతను తారాస్థాయిలో ప్రకటిస్తున్న ట్రంప్ విధానాలే అమెరకన్లలో జాత్యహంకార ధోరణులను పెంచుతున్నాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అనేకమంది ఆ విమర్శ

కాల్పుల ఘటనపై బాధపడలేదు కానీ, ట్రంప్‌ను సమర్థించడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తారా?
హైదరాబాద్ , సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (03:10 IST)
అమెరికాలోని కాన్సస్ ప్రాంతంలో తెలుగు యువకులపై జరిగిన కాల్పులపై నిరసనలు చెలరేగుతూనే ఉన్నాయి. వలస ప్రజలపై వ్యతిరేకతను తారాస్థాయిలో ప్రకటిస్తున్న ట్రంప్ విధానాలే అమెరకన్లలో జాత్యహంకార ధోరణులను పెంచుతున్నాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అనేకమంది ఆ విమర్శలను సమర్థిస్తున్నారు. వారిలో ప్రపంచ ప్రముఖ రచయిత్ర జేకే రౌలింగ్ కూడా ఉన్నారు.
 
ట్రంప్ విపరీత పోకడలపై స్పందించేవారిలో ప్రముఖ రచయిత్రి జేకే రౌలింగ్ ముందుంటారు. కాన్సస్‌లో జాతివివక్షకు బలైపోయిన భారతీయుడి ఉదంతంలో ఆమె మరోసారి ట్రంప్పై విమర్శలు ఎక్కుపెట్టారు.
 
కాన్సస్‌ జాతివివక్ష కాల్పులపై భారతీయ రచయిత ఆనంద్‌ గిరిధర్‌దాస్‌ ట్విట్టర్‌లో మండిపడ్డారు. ట్రంప్‌ అవలంభిస్తున్న విద్వేషపూరిత విధానాల మూలంగానే ఈ కాల్పులు జరిగాయని ఆయన విమర్శించారు. ఘటన అనంతరం ట్రంప్ వర్గాలు.. ఈ కాల్పులకు ట్రంప్ విధానాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవడంలో అత్యుత్సాహం ప్రదర్శించాయని ఆయన ట్విట్టర్‌లో విమర్శించారు. 
 
ఆనంద్‌ గిరిధర్‌దాస్‌ చేసిన ఈ ట్వీట్లను ఉటంకిస్తూ.. 'విద్వేషపూరిత ప్రసంగం సరదాగా ఉండదు. మనం వాడే భాష ప్రభావం చూపుతుంది' అని రౌలింగ్‌ ట్వీట్‌ చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయాల్లో నేను ప్రవేశించకూడదని చాలామంది ఆటంకాలు సృష్టించారు: దీపా జయకుమార్