Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయాల్లో నేను ప్రవేశించకూడదని చాలామంది ఆటంకాలు సృష్టించారు: దీపా జయకుమార్

ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై ఫోరంను ప్రారంభించాడానికి ముందు చాలా మంది తనకు అడ్డంకులు సృష్టించారని దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు. ఆదివారం చెన్నయ్‌లో విలేకరులతో మాట్లాడిన దీపా ఈ పోరంకు తానే కార్యదర్శినని, వేదిక కార్యవర్గాన్ని స

రాజకీయాల్లో నేను ప్రవేశించకూడదని చాలామంది ఆటంకాలు సృష్టించారు: దీపా జయకుమార్
హైదరాబాద్ , సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (01:59 IST)
ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై ఫోరంను ప్రారంభించాడానికి ముందు చాలా మంది తనకు అడ్డంకులు సృష్టించారని దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు. ఆదివారం చెన్నయ్‌లో విలేకరులతో మాట్లాడిన దీపా ఈ పోరంకు తానే కార్యదర్శినని, వేదిక కార్యవర్గాన్ని సోమవారం సాయంత్రం ప్రకటిస్తానని చెప్పారు. త్వరలోనో తాను రాజకీయ ప్రకటన చేస్తానని, రాష్ట్రమంతటా పర్యటించి ప్రజలను కలుస్తానని పేర్కొన్నారు. 
 
తనకు ఎదురవుతున్న సమస్యలను అధిగమించడమే కాకుండా తనకు మద్దతు తెలుపుతున్న వారి అభిప్రాయాలపై ఆధారపడి ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై ఫోరంను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల అభిమతాన్ని, ప్రత్యేకించి ఏఐడీఎంకే సానుభూతిపరుల అభిమతాన్ని అనుసరించి భవిష్యత్తును నిర్ణయించుకుంటానని దీపా చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను మర్యాదపూర్వకంగానే  కొన్నాళ్ల క్రితం కలిశానని, ఆయన గ్రూపులో కలవాలా వద్దా అన్న విషయంపై భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటానని దీపా తెలిపారు. 
 
తన సోదరుడు దీపక్ ఇటీవల చేసిన ప్రకటనల వెనుక శశికళ కుటుంబ సభ్యులు ఉన్నారని దీపా తెలిపారు. పోయెస్ గార్డెన్ సహా జయలలిత ఆస్తుల వారసత్వం తనకు తన సోదరి దీపాకే చెందుతుందని, ఈ విషయమై జయలలిత ఒక విల్లు కూడా రాసి ఉంచారని ఇటీవలే జయకుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన అత్త జయలలిత జయంతి సందర్భంగా గత శుక్రవారమే దీపా పెరవై వేదికను ప్రారంభించారు ఉప ఎన్నిక ప్రకటించినప్పుడు ఆర్.కె నగర్ అసెంబ్లీ స్థానంనుంచి పోటీ చేస్తానని దీపా పేర్కొన్నారు
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల వేట ప్రారంభం... రంగంలోకి దిగిన ఆర్మీ