విశ్రాంతి కోసం బీచ్‌కెళ్లిన ముగ్గురు ఎయిర్‌హోస్టెస్‌పై ఇద్దరు పైలట్లు అత్యాచారం చేశారు. డ్రగ్స్ కలిపిన బీర్లు తాపించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్యూర్టో రికోలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్యూర్టో రికోలో విశ్రాంతి కోసమని ఇద్దరు పైలట్లతో కలిసి ముగ్గురు యువతులు బీచ్‌కు వెళ్లారు. ఆ యువతులకు డ్రగ్స్ కలిపిన బీర్లను తాపించారు. దీంతో వారు మత్తులోకి జారుకున్నారు.
ఆ తర్వాత ఇద్దరు యువతులపై ఇద్దరు పైలట్లు అత్యాచారానికి పాల్పడ్డారు. మరో యువతి మాత్రం వాంతులు చేసుకోవడంతో ఆమెను వదిలిపెట్టారు. వారిపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టు తెలిసినా.. తాము ఏం చేయలేని స్థితిలో ఉన్నామని బాధిత మహిళలు ఆవేదన చెందారు.
మరుసటి రోజు పైలట్లతో ఘర్షణకు దిగిన యువతులు వారిపై యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. యాజమాన్యం మాత్రం దీన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కలిసి బీచ్‌కు వెళ్లి ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని యువతులను తప్పుబట్టింది. అయినప్పటికీ, తమకు జరిగిన అన్యాయంపై తొమ్మిది నెలలుగా యువతులు పోరాటం చేస్తూనే వచ్చారు. చివరకు వారికి న్యాయం చేసేందుకు విమానయాన సంస్థ హామీ ఇచ్చింది.