Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ నిజమైన దేశ భక్తుడు

jaishankar
, బుధవారం, 20 ఏప్రియల్ 2022 (11:53 IST)
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ నిజమైన దేశభక్తుడు అంటూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ అన్నారు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకోవాలంటూ పలు ప్రపంచ దేశాలు భారత్‌పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. కానీ, భారత్ మాత్రం తన సొంత అజెండాకు కట్టుబడి ముందుకు సాగుతోంది. ముఖ్యంగా, ఈ యుద్ధం కారణంగా దేశంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేలా ముందుకు జాగ్రత్తగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతోంది. 
 
ఈ విధానాన్ని రష్యా సమర్థిస్తుంది. "పరోక్షంగా రష్యా నుంచి తమకు అవసరమైనవి దిగుమతి చేసుకుంటా. అభివృద్ధి, భద్రత కోణంలో మా దేశం కోసం నిర్ణయాలు తీసుకుంటాం" అంటూ జైశంకర్ పేర్కొన్నారు. దీంతో రష్యా విదేశాంగ మంత్రి ఇలా కీర్తించడం గమనార్హం. 
 
భారత్‌కు అతి తక్కువ ధరకే చమురు సరఫరా చేస్తామని రష్యా ఆఫర్ చేయడం తెలిసిందే. అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా జైశంకర్‌ను లవ్రోవ్ అభివర్ణించారు. రష్యా ఆహారం, భద్రత, రక్షణ కోసం సహచర పాశ్చాత్య దేశాలపై ఆధారపడదని స్పష్టం చేశారు. యూఎన్ చార్టర్ను ఉల్లంఘిస్తూ చట్టవిరుద్ధమైన చర్యలవైపు నిలవని దేశాలతో సహకారానికి తాము సుముఖంగా ఉన్నామని, భారత్ కూడా అలాంటి దేశాల్లో ఒకటని లవ్రోవ్ చెప్పారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వార్తల్లో నిలిచిన ఎంపీ నందిగం.. అసలేం జరిగిందంటే?