Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసిస్ చీఫ్ నిద్రించేటప్పుడు కూడా వాటిని తీసి పక్కనబెట్టడా? అనుమానం వస్తే?

ఐసిస్ క్రూరత్వానికి మారుపేరు. చిన్న తప్పులకే పీకలు కోసి.. తలలు నరికి హింసాయుత కార్యకలాపాలకు పాల్పడే ఐసిస్ గురించి ఓ మీడియా సంస్థ షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఇరాక్ లోని మోసుల్ నగరాన్ని ఇరాక్, కుర్దిష

ఐసిస్ చీఫ్ నిద్రించేటప్పుడు కూడా వాటిని తీసి పక్కనబెట్టడా? అనుమానం వస్తే?
, శుక్రవారం, 18 నవంబరు 2016 (10:29 IST)
ఐసిస్ క్రూరత్వానికి మారుపేరు. చిన్న తప్పులకే పీకలు కోసి.. తలలు నరికి హింసాయుత కార్యకలాపాలకు పాల్పడే ఐసిస్ గురించి ఓ మీడియా సంస్థ షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఇరాక్ లోని మోసుల్ నగరాన్ని ఇరాక్, కుర్దిష్, అమెరికన్ దళాలు చుట్టుముట్టినప్పటికీ ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ పట్టుబడకపోవడానికి గల కారణాలపై సదరు మీడియా ఆరా తీసింది. 
 
ఈ క్రమంలో ఐసిస్ చీఫ్ నిద్రించే సమయంలో కూడా తాను ధరించిన మానవబాంబును పక్కనబెట్టడని తెలుసుకుంది. అంతేకాకుండా, తన అనుచరులతో నవ్వుతూ మాట్లాడే బాగ్దాదీ తీరులో మార్పు వచ్చిందని.. అనుమానం వస్తే కనుక, ఎంత నమ్మిన బంటును అయినా సరే దారుణంగా చంపిస్తున్నాడని తెలిపింది.
 
ఇరాక్, కుర్దిష్, అమెరికన్ దళాల కదలికలను ఎప్పటికప్పుడు తన నమ్మిన బంట్ల ద్వారా అండర్ గ్రౌండ్ లో తలదాచుకుంటున్న బాగ్దాదీ తెలుసుకుంటున్నాడని, ఒకవేళ, సైన్యానికి పట్టుబడే పరిస్థితులు వస్తే, అక్కడికక్కడే ఆత్మాహుతికి పాల్పడేందుకు మానవబాంబులను ధరించే వుంటున్నాడని మీడియా సంస్థ వెల్లడించింది. చివరకు బాగ్దాదీ నిద్రపోయే సమయంలో కూడా మానవబాంబును పక్కన పెట్టడం లేదని, దానిని ధరించే నిద్రపోతున్నాడని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16ఏళ్లకే ప్రేమ పెళ్లి.. పెళ్లి చేసుకున్న వ్యక్తి తల్లిదండ్రులతో వెళ్ళిపోయాడు.. బాలిక ఉరేసుకుంది..