Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చర్మంపై దద్దుర్లు వచ్చినా కరోనా సోకినట్లేనట.. ఇటాలియన్ స్టడీ

Advertiesment
చర్మంపై దద్దుర్లు వచ్చినా కరోనా సోకినట్లేనట.. ఇటాలియన్ స్టడీ
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (15:12 IST)
కరోనా లక్షణాల్లో ప్రస్తుతం చర్మంపై దద్దుర్లు కూడా వచ్చి చేరాయి. కరోనా లక్షణాల్లో అలసట, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, ముక్కులో కారటం వంటివి వున్నాయి. తాజాగా మరో లక్షణాన్ని గుర్తించారు డాక్టర్లు. చర్మంపై దద్దుర్లు ఉన్నా కరోనా సోకినట్లేనని చెబుతున్నారు. 
 
ఇటాలియన్‌ స్టడీ ప్రకారం.. కరోనా వైరస్ సోకిన ప్రతి ఐదు మందిలో ఒకరికి చర్మ సంబంధ వ్యాధులు ఉన్నట్లు తేలింది. కరోనా బాధితులకు చర్మం మీద ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయని ఆ స్టడీ తెలిపింది. ఒకవేళ దద్దుర్లు ఉండి జ్వరం, దగ్గు, నొప్పులు లేకుంటే వారు వైరల్ టెస్ట్‌ చేయించుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్తున్నారు. కరోనా వైరస్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు వాపోతున్నారు. ఇక ఇటలీ జరిగిన అధ్యయనంలో 'ఇటలీలోని కరోనా బాధితుల్లో 20శాతం మందికి దద్దుర్లు ఉన్నాయి. అలాగే ఫిన్‌లాండ్‌, స్పెయిన్‌, అమెరికా, కెనడాలోని డాక్టర్లు సైతం కరోనా బాధితుల్లో ఎర్రటి పాచెస్‌, దురదలు ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఇక్కడి కరోనా బాధితుల్లో పరిశోధనలు జరుగుతున్నాయి.
 
భారత్‌లో ఇలాంటి కేసులు ఇప్పటివరకు పెద్దగా నమోదుకాలేదు. ఇలాంటి దద్దుర్లు ఎక్కువగా కాలిపైనా, బ్రొటనవేలిపైనా.. ఒక్కొక్కసారి చేతులపైనా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అందుచేత స్కిన్ రాషెస్ విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటకలో ఇద్దరు ఖైదీలకు కరోనా వైరస్