పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అవిశ్వాస తీర్మానానికి ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి చేయాలనుకున్న ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధిపతి మిస్టర్ ఖాన్‌ను కలిసిన తర్వాత ఆయన తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వారాంతంలో పార్లమెంటరీ అవిశ్వాసం ఓటింగ్‌కు ముందు కీలకమైన సంకీర్ణ భాగస్వామి తన అభిప్రాయాన్ని మార్చుకున్న నేపధ్యంలో ఖాన్ భవిష్యత్తు మరింత సందేహాస్పదంలో పడిపోయింది. రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ స్థితి గందరగోళంలో పడిపోయింది.
పాకిస్తాన్ దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా పూర్తిగా తమ పదవీకాలం పూర్తిచేయలేకపోవడం గమనార్హం. ఇమ్రాన్ ఖాన్ 2018లో ఎన్నికైనప్పటి నుండి తన పాలనలో అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ రేపు ప్రారంభం కానుంది.