ఐర్లాండ్ రైలులో పుట్టిన ఓ శిశువుకు జాక్ పాట్ కొట్టింది. రైలులో పుట్టిన ఆ శిశువు 25 సంవత్సరాల వరకు ఎక్కడికెళ్లినా ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఐరీష్ రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
	
	
గాల్వే నుంచి దుల్బిన్‌కు మంగళవారం రైలులో ప్రయాణించిన ఓ గర్భిణీ మహిళ రైలులోనే ప్రసవించింది. ఆమెకు ఓ వైద్యుడు, ఇద్దరు నర్సులు చికిత్స అందించారు. 
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	రైలులోనే ప్రసవం పూర్తయిన తర్వాత.. తల్లిని శిశువును ఆస్పత్రికి తరలించారు. ఐరీష్ రైలులో పుట్టిన ఆ పసికందుకు 25 ఏళ్ల వరకు రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం వుంటుందని రైల్వే శాఖ తెలిపింది. 
	 
	పురిటి నొప్పులతో ఐరీష్ టాయిలెట్‌లో ఇబ్బందిపడిన మహిళను కేటరింగ్ సిబ్బంది గుర్తించి.. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు రప్పించారు. అలా వచ్చిన వైద్యులు ఆమెకు రైలులోనే కాన్పు చేయించారు. 
	 
	ఇలా 20 నిమిషాల్లో ఆమెకు పండంటి పాప పుట్టిందని రైల్వే శాఖ సమాచార ప్రతినిధి చెప్పారు. రైలులో కాన్పుకు ఇబ్బంది పడిన మహిళకు తగిన రీతిలో చికిత్స అందించి సురక్షితంగా ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు.