Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణ హత్య.. ఇజ్రాయేల్ హస్తం వుందా?

న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణ హత్య.. ఇజ్రాయేల్ హస్తం వుందా?
, శనివారం, 28 నవంబరు 2020 (12:02 IST)
nuclear scientist
ఇరాన్ దేశపు ప్రసిద్ధ న్యూక్లియర్ శాస్త్రవేత్త మొహ్సేన్ ఫక్రీజాదే దారుణ హత్యకు గురయ్యారు. హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తముందని ఇరాన్ ఆరోపించడం కలకలం రేపుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌ శివారులో తన వాహనంలో వెళ్తున్న ఫక్రిజాదేపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ ఫక్రీజాదే ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. ఇరాన్ రక్షణశాఖకు చెందిన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అధిపతిగా ఫక్రిజాదే పనిచేశారు. ఈ హత్య వెనుక ఇజ్రాయేల్‌ హస్తం ఉన్నట్లు ఇరాన్‌ ఆరోపించింది.
 
ఈ మేరకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావేద్‌ జరీఫ్‌ ఐక్యరాజ్యసమితికి ఓ లేఖ రాశారు. టెహ్రాన్‌లో జరిగిన మొహ్సేన్ హత్య వెనుక ఇజ్రాయెల్‌ హస్తం ఉందని.. అయితే ఎలాంటి సాక్ష్యాదారాలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోందని లేఖ ద్వారా ఆరోపించారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.
 
ఇరాన్ శాస్త్రవేత్త ఫక్రీజాదేను హత్య వెనుక ఇజ్రాయెల్ నేరతత్వం, పిరికితనం స్పష్టంగా కన్పిస్తున్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ డబుల్ గేమ్ ఆడుతోందని..దీనిని ఖండించాల్సిన అవసరముందని తెలిపింది. తమ శాస్త్రవేత్త హత్యకు ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కొత్తగా 41,322 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఒక్కరోజే 485మంది మృతి