Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సముద్రంలో తెగిన ఇంటర్నెట్ కేబుల్స్ - హౌతీ రెబెల్స్ పనేనా?

Advertiesment
internet cables

ఠాగూర్

, ఆదివారం, 7 సెప్టెంబరు 2025 (19:04 IST)
ఎర్ర సముద్ర గర్భంలో వేసి ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోయాయి. దీంతో పాకిస్తాన్‌తో సహా మధ్య ప్రాచ్య దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పాకిస్తాన్, యూఏఈ దేశాల్లో ఇంటర్నెట్ వేగం మందగించిందని ప్రముఖ వాచ్ గాడ్ ఆర్గనైజేషన్ నెట్ బ్లాక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేబుల్స్ జెడ్డా సమీపంలోని తెగిపోయినట్టు గుర్తించింది. అయితే, సముద్రం అడుగున ఉన్న ఈ కేబుల్లో ఎలా తెగాయనే దానిపై స్పష్టత లేదని నిపుణులు చెబుతున్నారు. మరొక వాదన ప్రకారం హౌతీ రెబెల్స్ కుట్ర పన్ని ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేబుల్స్‌ను కట్ చేసి వుంటారని ప్రచారం సాగుతోంది. 
 
యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హౌతీ రెబెల్స్ గతంలో ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీచేశారు. గాజాలోని హమాస్ తీవ్రవాదులపై దాడులు ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకే హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో కేబుల్స్ కట్ చేసి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇలానే ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేశారని ఆరోపణలు రాగా వాటిని హౌతీ రెబెల్స్ ఖండించారు. తాజా ఘటనపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సౌదీ, పాకిస్తాన్, యూఏఈ వంటి దేశాల్లో మాత్రం ఇంటర్నెట్ వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్లడ్ చంద్రగ్రహణం : తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత