ఇండోనేషియా రాజధానిని మార్చనున్నారు. ప్రస్తుతం ఈ దేశ రాజధానిగా జకర్తా నగరం ఉంది. అయితే, ఇకపై దేశ రాజధానిగి కాళీమంథన్ నగరాన్ని చేయనున్నట్టు ఆదేశ అధ్యక్షుడు జోకో విడోడో సంచలన ప్రటకన చేశారు. ప్రస్తుతం ఉన్న జకర్తా నగరాన్ని తరచూ భూకంపాలు, సునామీలు సంభవిస్తున్నాయి. అలాగే, పలు అగ్ని పర్వతాలు పేలడానికి సిద్ధంగా ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో బోర్నియో ద్వీపంలో ఉన్న కాళీమంథన్ నగరానికి మార్చనున్నట్టు దేశాధ్యక్షుడు జోకో విడోడో సంచలన ప్రకటన చేశారు. జకార్తాపై ప్రకృతి విపత్తుల ప్రభావం అధికంగా ఉండటంతో రాజధానిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు పార్లమెంట్‌లో ప్రకటించాడు.
బోర్నియో ద్వీపంలోని కాళీమంథన్‌కు రాజధానిని తరలించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం జకార్తా నగరం 25 సెంటీమీటర్ల చొప్పున సముద్రంలో మునిగిపోతున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగినట్టయితే 2050 నాటికి నగరంలో మూడింట ఒక వంతు నీటి పాలవుతుందని హెచ్చరించారు. ఈలోగానే తగు జాగ్రత్తలు తీసుకుని, రాజధానిని కాళీమంథన్‌కు మార్చబోతున్నట్టు ఆయన వెల్లడించారు.