Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత సంతతి కెనడా మహిళకు నో అన్న అమెరికా.. ట్రంప్ బారిన పడ్డావంటూ అధికారి ఎకసెక్కం

భారత సంతతి కెనడా పౌరురాలు మన్‌ప్రీత్ కూనర్ ట్రంప్ బారిన పడ్డారా? అవునంటున్నారు అమెరికన్ బోర్డర్ ఏెజెంట్. కెనడా నుంచి అమెరికాకు ప్రయాణమైన కూనర్‌ని క్విబె్క్-వెర్మాంట్ సరిహద్దు వద్ద అడ్డుకున్న అమెరికా స

Advertiesment
Indian-origin Canadian
హైదరాబాద్ , గురువారం, 9 మార్చి 2017 (03:07 IST)
భారత సంతతి కెనడా పౌరురాలు మన్‌ప్రీత్ కూనర్ ట్రంప్ బారిన పడ్డారా? అవునంటున్నారు అమెరికన్ బోర్డర్ ఏెజెంట్. కెనడా నుంచి అమెరికాకు ప్రయాణమైన కూనర్‌ని క్విబె్క్-వెర్మాంట్ సరిహద్దు వద్ద అడ్డుకున్న అమెరికా సరిహద్దు నిఘా అధికార్లు ఆరుగంటలు శల్యపరీక్ష చేసిన తర్వాత మీకు ప్రవేశం లేదు అంటూ చావుకబురు చల్లగా చెప్పేశారు. పైగా యు హేవ్ బీన్ ట్రంప్డ్ అంటూ పరిహసించారు.
భారతీయురాలైన మన్ ప్రీత్ కూనర్ ప్రస్తుతం కెనడా పౌరురాలిగా మాంట్రియల్‌లో ఉంటున్నారు. గత ఆదివారం అమెరికాకు బయలు దేరిన తనను రెండు దేశాల సరిహద్దు ప్రాంతమైన క్విబెక్-వెర్మాట్ సరిహద్దు వద్ద బోర్డ్రర్ ఏజెంట్లు అడ్డుకున్నారని, తన వేలిముద్రలు తీసుకుని, ఫోటో తీశారని, ఆరుగంటల నిరీక్షణలో ఉంచి తర్వాత అమెరికాకు తనకు ప్రవేశం లేదని చెప్పి తిప్పి పంపించేశారని కూనర్ చెప్పారు.
 
సరైన అమెరికా వీసా లేని వలసదారు మీరంటూ అమెరికన్ అధికారి పేర్కొన్నారని కూనర్ తెలిపారు. అమెరికాలోకి రాకుండా అడ్డుకుంటున్నాం కాబట్టి మీరు ఇప్పుడు ట్రంప్ బారిన పడ్డట్టుగా భావిస్తూండవచ్చునని ఆ ఆధికారి వ్యాఖ్యానించారట. 
 
నమ్మశక్యంగా లేదు. అమెరికాలో ప్రవేశించకుండా నన్ను అడ్డుకున్నారు. నేను ఇప్పుడు వలసదారునైపోయాను. అమెరికాలో అడుగుపెట్టాలంటే నాకిప్పుడు కొత్తగా వీసా కావాలి. అమెరికాలోకి అడుగుపెట్టలేరని చెబుతూ ఆ అధికారి యు హావ్ బీన్ ట్రంప్డ్ అన్నారు అని మన్ ప్రీత్ తనఫేస్ బుక్‌లో పోస్టు చేశారు. 
 
గత సంవత్సరం డిసెంబర్లోనూ ఆమె అమెరికాలోకి ప్రవేశిస్తుండగా కంప్యూటర్లో సాంకేతిక సమస్య కారణంగా 24 గంటలపాటు ఆమెను అధికారులు నిరోధించారు.
 
ఏదైమైనా ఇంగ్లీష్ నిఘంటువులో సరికొత్త పదం చేరింది కాబోలు. ట్రంప్డ్. నిజంగానే ట్రంప్ సార్థక నామథేయుడు
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ పథకానికి ఓకే అనేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఎట్టకేలకు రైతుకు లాభం