Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్ పథకానికి ఓకే అనేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఎట్టకేలకు రైతుకు లాభం

అసెంబ్లీలో, బయట పామూ, ముంగిస లాగా తలపడే పాలక పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో, దాన్ని ఎలా అమలు పర్చాలో ఏపీ ఇంధన శాఖ ఒకమంచి నిర్మయం ద్వారా చూపించింది. పార్టీలకు, ప్రభుత్వాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త వెసలుబాటు కలగచేస్

వైఎస్ పథకానికి ఓకే అనేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఎట్టకేలకు రైతుకు లాభం
హైదరాబాద్ , గురువారం, 9 మార్చి 2017 (02:20 IST)
అసెంబ్లీలో, బయట పామూ, ముంగిస లాగా తలపడే పాలక పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో, దాన్ని ఎలా అమలు పర్చాలో ఏపీ ఇంధన శాఖ ఒకమంచి నిర్మయం ద్వారా చూపించింది. పార్టీలకు, ప్రభుత్వాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త వెసలుబాటు కలగచేస్తే ఎంతమంది ప్రజలకు మేలు కలుగుతుందో కాకతాళీయంగా ఇంధనశాఖ చేసి చూపించింది. అలాంటి ఒక నిర్ణయంతో దాదాపు ఏడేళ్లుగా రాష్ట్రంలో రైతులు పడుతున్న బాధలకు కాస్త ఉపశమనం కలిగినట్లయింది. ఇష్టప్రకారం, దౌర్జన్యంగా రైతుల భూముల్లో విద్యత్ లైన్లు, ప్లాంట్ల నిర్మాణం చేపట్టడం ఇక కుదరదని చెబుతూ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన ఒక జేవోను  పూర్తిస్థాయిలో అమలు చేయాలని నేరుగా జిల్లా కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించడం ముదావహం. 
 
విద్యుత్‌ లైన్లు, ప్లాంట్ల నిర్మాణానికి అడ్డగోలుగా రైతుల భూములు లాక్కోవడానికి వీల్లేకుండా రూపొందించిన జీవో ఎంఎస్‌–24 అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులిచ్చింది. విద్యుత్‌ లైన్లు, టవర్ల కోసం చిన్న తరహా రైతులు చెట్లను, పంట పొలాలను నష్టపోతున్న విషయాన్ని గుర్తించిన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2007లోనే జీవోఎంఎస్‌ నం. 24 తీసుకొచ్చారు. రైతులు న్యాయంగా కోరినంత నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని  పేర్కొన్నారు.
 
అయితే ఆ తర్వాత పాలకులు దానిని చిత్తశుద్ధిగా అమలు చేయలేదు. దీంతో ట్రాన్స్‌కో, డిస్కమ్‌ ప్రాజెక్టులను రైతులు అడ్డుకుంటున్నారు. విద్యుత్‌ లైన్లకు అడ్డుపడుతూ విద్యుత్‌ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఏపీఈఆర్‌సీ ప్రభుత్వాన్ని కోరింది. 2007లోనే రైతులకు అనువుగా నష్టపరిహారం ఇవ్వాలనే చట్టం తీసుకొచ్చారని, అయితే దీన్ని అధికారులు అమలు చేయడం లేదని పేర్కొంది. 
దీనిపై స్పందించిన రాష్ట్ర ఇంధనశాఖ  చట్టం అమలుకు జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది.
 
తెలంగాణలో నష్టపరిహారం ఇవ్వకుండా తమ పొలాల్లో విద్యుత్ తీగలు నాటితే ఒప్పుకునేది లేదంటూ తిరగబడిన రైతు కుటుంబాన్ని ఆ తీగలపైకే లేపి హింసించిన ఉదంతం కేంద్రప్రభుత్వాన్ని మేలుకొల్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా జాగ్రత్తపడి రైతు అనుకూల నిర్ణయాన్ని తీసుకోవడాన్ని నిజంగానే ప్రశంసించాలి. ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో రాజకీయాలు, విభేదాలు చోటు చేసుకోకుంటే జరిగే మంచికి రాష్ట్ర ఇంధనశాఖ తీసుకున్న నిర్ణయం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచంలో బంగారం మొత్తం మనదేనా? మరెవ్వరికీ దక్కనీయరా? చైనాకు అంత అక్కసు అందుకేనా?