Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచంలో బంగారం మొత్తం మనదేనా? మరెవ్వరికీ దక్కనీయరా? చైనాకు అంత అక్కసు అందుకేనా?

ఎన్ని ఆర్థిక సంక్షోభాలు ఎదురైనా, స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయినా బంగారం అంటే బంగారమే అంటున్నారు భారతీయులు. ఒక సంవత్సరంలో ఒక్క భారతదేశంలోనే 750 టన్నుల బంగారం ఇళ్లలోకి వచ్చి చేరుతోందని తెలిసి ప్రపంచం దిగ్భ్రాంతి చెందుతోంది. 750 టన్నులంటే పదిటన్నుల పర

ప్రపంచంలో బంగారం మొత్తం మనదేనా? మరెవ్వరికీ దక్కనీయరా? చైనాకు అంత అక్కసు అందుకేనా?
హైదరాబాద్ , గురువారం, 9 మార్చి 2017 (01:33 IST)
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాలు ప్రపంచదేశాలను చాప చుట్టగా చుట్టేయనీ గాక.. పెద్దనోట్ల రద్దు వంటి అవాంఛిత ఉత్పాతాలు ఒక్కసారిగా దాడి చెయ్యనీగాక.. బంగారంపై భారతీయుల మోజు మాత్రం ఇంతా అంతా కాదు. ఎన్ని ఆర్థిక సంక్షోభాలు ఎదురైనా, స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయినా బంగారం అంటే బంగారమే అంటున్నారు భారతీయులు. ఒక సంవత్సరంలో ఒక్క భారతదేశంలోనే 750 టన్నుల బంగారం ఇళ్లలోకి వచ్చి చేరుతోందని తెలిసి ప్రపంచం దిగ్భ్రాంతి చెందుతోంది. 750 టన్నులంటే పదిటన్నుల పరిమాణంలో ఉండే 75 లారీల్లో పట్టే బంగారం అన్నమాట.

మరో నాలుగేళ్లలోనే మన బంగారం డిమాండ్ 950 టన్నులకు చేరే వీలుందని అంచనా. ఒక్కవిషయం మాత్రం నిజం. చైనా మనకంటే ఎన్నో రెట్ల అభివృద్ధిని సాధించి ఉండవచ్చు గాక. కానీ ఒక్క బంగారం విషయంలో మాత్రం ఇంకో వందేళ్లవరకు భారత్‌కు సమానం కాలేదంటున్నారు. చైనా అక్కసు ఎంతగా ఉందంటే. బంగారం కోసం డబ్బు తగలేస్తున్న పనికిమాలి భారతీయలు అని వ్యాఖ్యానించేంతగా.. కానీ ఈ  వ్యాఖ్యలో ఉడుకుమోత్తనమే ఉందనుకోండి. ఎందుకంటే ఆ దేశంలో మహిళలకు బంగారుపై వ్యామోహం చాలా చాలా తక్కువ. భారత్‌ను ఈ విషయంలో కొట్టలేకపోతున్నామే అనే దుగ్ధ గత కొన్నేళ్లుగా చైనా మీడియాలో పెరుగుతోంది. 
 
అసలు విషయానికి వస్తే... భారత్‌ పసిడి డిమాండ్‌ 2020 నాటికి 950 టన్నులకు చేరుతుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. ఆర్థికవృద్ధి, పసిడి మార్కెట్‌లో పారదర్శకత పసిడికి దేశంలో డిమాండ్‌ను గణనీయంగా పెంచుతాయని డబ్ల్యూజీసీ నివేదిక బుధవారం పేర్కొంది.  గత ఏడాదిగా పసిడి డిమాండ్‌ తగ్గుతూ వస్తున్నా... భవిష్యత్‌లో తిరిగి రికవరీ అవుతుందని వివరించింది. కరెంట్‌ అకౌంట్‌ లోటు ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని పసిడికి డిమాండ్‌ను తగ్గించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఆయా ప్రయత్నాలు ఫలించబోవని వివరించింది.  సమాజంలో ఈ మెటల్‌ పట్ల ఉన్న ఆకర్షణే దీనికి కారణమని తెలిపింది. నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే...
 
డిమాండ్‌ మళ్లీ పుంజుకుంటుంది. 2017లో డిమాండ్‌ 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకూ ఉండవచ్చు. అయితే 2020 నాటికి మాత్రం 850 టన్నుల నుంచి 950 టన్నులకు చేరే వీలుంది. ప్రస్తుతం పసిడి డిమాండ్‌ తగ్గడానికి డీమోనిటైజేషన్‌ ప్రభావం కూడా ఉంది. మేము 2016 మొదటి త్రైమాసికంలో ఒక వినియోగ సర్వే నిర్వహించాం. కరెన్సీలతో పోల్చితే, పసిడి పట్ల తమకు ఎంతో విశ్వాసం ఉందని 63 శాతం మంది భారతీయులు ఈ సర్వేలో తెలిపారు. దీర్ఘకాలంలో పసిడే తమ భరోసాకు పటిష్టమైనదని 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ విశ్వాసాలను డీమోనిటైజేషన్‌ మరింత పెంచింది. ప్రజలు ఒకసారి డిజిటల్‌ పేమెంట్లకు అలవాటు పడినప్పుడు, ఈ ధోరణి పసిడి కొనుగోళ్లు పెరగడానికీ దోహదపడుతుంది. ఆర్థికవృద్ధి, పారదర్శకత అంశాలు ఇక్కడ పసిడి డిమాండ్‌ పెరగడానికి దోహదపడే అంశాలు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

5 నెలల్లో నారా లోకేష్ ఆస్తులు 23 రెట్లు... వామ్మో...?