Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెంటల్ ట్రంప్ విద్వేష పాలసీలు: మొన్న వంశీ, నిన్న శ్రీనివాస్ నేడు హర్నీష్ పటేల్ బలి

అమెరికాలో మరో భారతీయుడు దారుణంగా హత్యకు గురైయ్యాడు. కన్సాస్ ఘటనలో తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య చోటుచేసుకుని పట్టుమని పదిరోజులైనా కాలేదు.. మరో ప్రవాస భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. మొన్న

మెంటల్ ట్రంప్ విద్వేష పాలసీలు: మొన్న వంశీ, నిన్న శ్రీనివాస్ నేడు హర్నీష్ పటేల్ బలి
, శనివారం, 4 మార్చి 2017 (14:13 IST)
అమెరికాలో మరో భారతీయుడు దారుణంగా హత్యకు గురైయ్యాడు. కన్సాస్ ఘటనలో తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య చోటుచేసుకుని పట్టుమని పదిరోజులైనా కాలేదు.. మరో ప్రవాస భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. మొన్న వంశీ, నిన్న శ్రీనివాస్.. నేడు హర్నీష్ పటేల్‌లు అమెరికా జాత్యహంకారానికి బలైపోయారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్వేష పూరిత పాలసీలతో అమెరికాలోని జాత్యహంకార ఉన్మాదులకు వేయి ఎనుగుల బలాన్నిచ్చింది. ఎన్నారైలపై దురుసుగా వ్యవహరిస్తూ పొట్టనబెట్టుకుంటున్నారు. అయినా ట్రంప్ మాత్రం ఈ జాత్యహంకార చర్యలు సమర్థిస్తున్నారు. అంతేగాకుండా ఇలాంటి ఘటనలు ఇక జరగబోవని హామీ ఇవ్వట్లేదు. దీనిపై భారతీయులు ట్రంప్‌ అంటేనే మండిపడుతున్నారు. ఇక అమెరికాలో ఉండాలా వద్దా అనుకుని తలపట్టుకుంటున్నారు. స్వదేశానికే వెళ్లడమే మేలనుకుంటున్నారు. 
 
తాజాగా హర్నీష్ పటేల్ అనే 43 ఏళ్ల ఎన్నారై వ్యాపారవేత్తను కొందరు దుండగులు కాల్చి చంపిన ఘటన సౌత్ కరోలినాలోని లాన్కస్టెర్‌లో అతని ఇంటి ముందే చోటుచేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11 గంటల 24 నిమిషాలకు ఈ దారుణం జరిగింది.
 
సౌత్ కరోలినాలో స్పీడీ మార్ట్‌ను నిర్వహిస్తున్న పటేల్... గురువారం రాత్రి 11:24 గంటల సమయంలో మార్ట్‌ను మూసేసి ఇంటికి వెళుతున్నాడు. ఇంటి ముందు ఉండగానే కొందరు దుండగులు పటేల్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పులు శబ్దాలు విన్న భార్య, కుమారుడు బయటకు వచ్చి చూశారు. పోలీసులకు సమాచారం చేరవేసి ఆస్పత్రికి తరలించేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీల ఆధారంతో దర్యాప్తు మొదలెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేటీఆర్‌లా ఐటీ మంత్రిగా నారా లోకేష్‌.. బడ్జెట్ సమావేశాల్లోనే క్లారిటీ.. ఉగాదికి కేబినెట్ విస్తరణ?