Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేటీఆర్‌లా ఐటీ మంత్రిగా నారా లోకేష్‌.. బడ్జెట్ సమావేశాల్లోనే క్లారిటీ.. ఉగాదికి కేబినెట్ విస్తరణ?

ఏపీ సీఎం కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఈనెల 6న లోకేష్ నామినేషన్ పర్వానికి రంగం సిద్ధమై

Advertiesment
కేటీఆర్‌లా ఐటీ మంత్రిగా నారా లోకేష్‌.. బడ్జెట్  సమావేశాల్లోనే క్లారిటీ.. ఉగాదికి కేబినెట్ విస్తరణ?
, శనివారం, 4 మార్చి 2017 (11:47 IST)
ఏపీ సీఎం కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఈనెల 6న లోకేష్ నామినేషన్ పర్వానికి రంగం సిద్ధమైంది. తద్వారా నారా లోకేష్ కేబినేట్‌లోకి ఎంట్రీ ఖరారైపోయింది. అయితే లోకేష్‌కి ఇచ్చే బెర్తుపై ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. 
 
ఇప్పటికే చాలామంది సీనియర్ మంత్రులున్నప్పటికీ బాబు క్యాబినెట్లో లోకేష్‌కి ఏ పోర్ట్ ఫోలియో దక్కుతుందనే దానిపై సస్పెన్స్ వీడట్లేదు. సాధారణ పాలన, లా అండ్ జస్టిస్, ఐటీ, ఇంధన-మౌలిక వసతులు, పెట్టుబడులు, సినిమాటోగ్రఫీ-టూరిజం, పరిశ్రమలు-వాణిజ్యం వంటివన్నీ చంద్రబాబు ఖాతాలోనే ఉన్నాయి. వీటిలో ఐటీ మాత్రం నారా లోకేష్‌కు ఇచ్చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
బడ్జెట్ సమావేశాల్లోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఉగాదిలోపు కేబినెట్ విస్తరణ, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా పూర్తైపోయేలా రంగం సిద్ధం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా తన కుమారుడైన కేటీఆర్‌కి ఐటీతో పాటు భారీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖలు ఇచ్చారు. ఇదే తరహాలో నారాలోకేష్‌కు కూడా భారీ పరిశ్రమలు- ఐటీ శాఖలు ఇవ్వాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తరహాలోనే చంద్రబాబు కూడా తన కుమారుడికి తగిన హోదా ఇవ్వాలని.. ఆపై రాజకీయాల నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు.
 
కానీ లోకేష్‌ కేటీఆర్ తరహాలో స్పీచ్‌కు పనికిరారని టాక్ వస్తోంది. అందుచేత నారా లోకేష్ పూర్తి రాజకీయ నాయకుడిగా ఎదిగేదాక తండ్రి అయిన ఏపీ సీఎం చంద్రబాబు ఆయన వెన్నంటి వుంటారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. విభజన తర్వాత కష్టాల్లో కూరుకుపోయిన ఏపీని గట్టిక్కించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. 
 
హైదరాబాద్ తరహాలో అమరావతిని అభివృద్ధి చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. కేంద్రం నుంచి సరైన నిధుల కోసం వేచి చూస్తున్నారు. మరి బీజేపీ సర్కారు ఏపీ రాష్ట్రాభివృద్ధికి సత్వర చర్యలు తీసుకుంటుందో లేదా నాన్చుతుందో వేచి చూడాలి. అదే గనుక చేస్తే.. కాంగ్రెస్ తరహాలో బీజేపీకి కూడా ప్రజలు తగిన రీతిలో బుద్ధిచెప్తారని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాముకాటుకు ప్రతీ ఏటా 50వేల మంది చనిపోతున్నారట? అడవి విస్తీర్ణం తగ్గడమే కారణమా?