Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో భారతీయుడు

vivek ramaswamy
, గురువారం, 23 ఫిబ్రవరి 2023 (13:21 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారతీయుడు ఒకరు ముందుకు వచ్చారు. ఆయన పేరు వివేక్ రామస్వామి. ఇండో అమెరికన్ పారిశ్రామికవేత్త. రిపబ్లికన్ పార్టీ నేత. ఈయన తన పార్టీ ప్రైమరీ ఎన్నికల రేసులో పాల్గొంటానని తాజాగా ప్రకటించారు. ఈ పార్టీ తరపున ఇప్పటికే మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత మూలాలు ఉన్న నిక్కీ హేలీలు బరిలో ఉండగా, ఇపుడు రామస్వామి రేసులోకి వచ్చారు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో గెలిచినవారికే ఆ తర్వాత జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పిస్తారు. 
 
కాగా, అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న 37 యేళ్ల రామస్వామి ఓహాయోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులది కేరళ. 2007లో హార్వర్డ్ కాలేజీలో జీవశాస్త్రంలో డిగ్రీ పట్టాపొందారు. ఆ తర్వాత యేల్ లా స్కూల్ నుంచి డాక్టర్ ఆఫ్ జురిస్ర్పుడెన్స్ పట్టాపొందారు. 2014లో బయోటెక్ సంస్థ రోయివంట్ సైన్సెన్స్‌ను నెలకొల్పారు. 
 
గత 2015 నుంచి 16 వరకు అతిపెద్ద బయోటెక్ ఐపీవోలకు నేతృత్వం వహించారు. పలు టెక్నాలజీ సంస్థలనూ నెలకొల్పారు. రాజకీయాల్లో ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేసేందుకు గతయేడాది స్టైవ్ అసెట్ మేనేజ్‌మెంట్ అనే కొత్త సంస్థను ప్రారంభించారు. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు అయితే తన తొలి ప్రాధాన్యత అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట వేస్తానని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయనున్న భారత సంతతి వ్యక్తి