Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో మొదలైంది.. న్యూజిలాండ్‌లోనూ కొనసాగుతోంది. ఇక వీళ్లు మారరంతే..!

గత కొద్ది రోజులుగా అమెరికాలో భారతీయులపై జాత్యహంకార దాడులు జరగుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ జాత్యహంకార జాడ్యం అమెరికాకే పరిమితం కాకుండా న్యూజిలాండ్‌కు కూడా పాకింది. జాతి వివక్ష మూలాలు పాశ్చాత్యదేశాల్లో వ్యక్తులపై దాడులకు పరిమితం కాలేదని, ఉపాధి అవకాశా

అమెరికాలో మొదలైంది.. న్యూజిలాండ్‌లోనూ కొనసాగుతోంది. ఇక వీళ్లు మారరంతే..!
హైదరాబాద్ , మంగళవారం, 7 మార్చి 2017 (01:50 IST)
గత కొద్ది రోజులుగా అమెరికాలో భారతీయులపై జాత్యహంకార దాడులు జరగుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ జాత్యహంకార జాడ్యం అమెరికాకే పరిమితం కాకుండా న్యూజిలాండ్‌కు కూడా పాకింది. జాతి వివక్ష మూలాలు పాశ్చాత్యదేశాల్లో వ్యక్తులపై దాడులకు పరిమితం కాలేదని, ఉపాధి అవకాశాల లేమి వారిని విచక్షణా రహితంగా మార్చుతోందని ఈ ఉదంతం చెబుతోంది. ఇంతకూ వారి ఉపాధికల్పన సమస్యకు విదేశీయులే కారణమా అనే ప్రశ్న వారు వేసుకోనట్లుంది. అందుకే సమస్య విదేశీ హస్తంగా మారిపోయి గురిపెట్టాల్సిన బాణం పక్కదోవ పడుతున్నట్లుంది. విషయానికి వస్తే...
 
న్యూజిల్యాండ్‌లో ఓ భారతీయుడిపై అక్కడి పౌరుడు జాత్యహంకార దూషణలకు దిగాడు. రోడ్డు మీద వాహనం నడుపుతున్న సమయంలో జరిగిన సంఘటన ఈ ఉదంతానికి కారణంగా అక్కడి మీడియా పేర్కొంది. కారు లోపలి నుంచి ఈ ఘటన మొత్తాన్ని నర్వీందర్‌ సింగ్‌ చిత్రీకరించారు.
 
రోడ్డుపై జరిగిన చిన్న ఉదంతానికి కారు వద్దకు తన గర్ల్‌ ఫ్రెండ్‌తో వచ్చిన న్యూజిలాండ్‌ జాతీయుడు దూషణలకు దిగినట్లు నర్వీందర్‌ సింగ్‌ వీడియోలో తెలిపారు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో వీడియోను చిత్రీకరిస్తున్నట్లు అతనితో చెప్పిన తర్వాత మరింత రెచ్చిపోయాడని చెప్పారు. న్యూజిలాండ్‌ విడిచి వెళ్లిపోవాలని బెదిరించినట్లు తెలిపారు. పంజాబీల గురించి కూడా దుర్భాషలాడినట్లు చెప్పారు. అతని మాటలు తనను కలవరానికి గురిచేసినట్లు తెలిపారు.
 
ఆవేశంతో అతను ఏదైనా ఆయుధంతో తనపై దాడి చేస్తాడేమోననే భయం కలిగిందని చెప్పారు. అక్కడి నుంచి వెళ్లిపోయి కారును పార్కు చేస్తుండగా సదరు వ్యక్తి మళ్లీ అక్కడికి వచ్చి తనను దుర్భాషలాడాడని తెలిపారు. గత వారం బిక్రమ్‌జిత్‌ సింగ్‌ అనే వ్యక్తికి కూడా ఇలాంటి పరిస్ధితి ఎదురైనట్లు చెప్పారు. వేగంగా వెళ్తున్న బిక్రమ్‌జిత్‌ను అడ్డగించిన ఓ న్యూజిలాండ్‌ పౌరుడు.. 'నీ దేశానికి వెళ్లిపో.. వేగం తగ్గించుకుని నడుపు!' అంటూ కామెంట్‌ చేశాడని తెలిపారు.
 
ఘటనల పరంపర చూస్తుంటే ఇది వ్యక్తి ద్వేషం కాదు. జాతి ద్వేషమే అనడానికి సందేహాలున్నాయా?
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంత ముద్ద ఎవరు పెడతారో వారికే నా ఓటు: ఆకలి మంటల్లో పూలన్ దేవి తల్లి