Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంత ముద్ద ఎవరు పెడతారో వారికే నా ఓటు: ఆకలి మంటల్లో పూలన్ దేవి తల్లి

బందిపోటు రాణిగా జీవితం ప్రారంభించి మీర్జాపూర్ ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టిన పూలన్ దేవి తల్లి ఆమె. పేరు మూలాదేవి. పూలన్ దేవి బతికి ఉన్నంత వరకు పూలన్ కా మాత అని ప్రత్యేక గుర్తింపును పొందిన మూలాదేవి ఇప్ప

Advertiesment
ఇంత ముద్ద ఎవరు పెడతారో వారికే నా ఓటు: ఆకలి మంటల్లో పూలన్ దేవి తల్లి
హైదరాబాద్ , మంగళవారం, 7 మార్చి 2017 (01:37 IST)
పోటీ చేసేది ఏ పార్టీ వాళ్లయితే నాకేంటి.. ఎవరైతే తనకు ఇంత ముద్ద పెడతారో వారికే నా ఓటు అని అంటున్నారు 70 ఏళ్ల ఆ ముదివగ్గు. పేదవాళ్లు ఆకలి బాధతో కడుపు చేతపట్టుకోవడం మన దేశంలో నిత్య విషాదమే. కానీ ఈ పెద్దామె కథ వేరు. బందిపోటు రాణిగా జీవితం ప్రారంభించి మీర్జాపూర్ ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టిన పూలన్ దేవి తల్లి ఆమె. పేరు మూలాదేవి. పూలన్ దేవి బతికి ఉన్నంత వరకు పూలన్ కా మాత అని ప్రత్యేక గుర్తింపును పొందిన మూలాదేవి ఇప్పుడు ఏ హోదాలూ లేని నిరుపేదగా చిరుగుల డేరా వంటి ఒక పూరి గుడిసెలో ఉంటున్నారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలూ పలకరించి అంతో ఇంతో చేతిలో పెట్టడం తప్ప వాళ్లను ఇప్పుడెవరూ పట్టించుకునేవారు లేరు. చిన్నకూతురు నాలుగిళ్లలో గిన్నెలు కడిగి సంపాదించుకొచే కాసింత డబ్బే ఆ కుటుంబానికి ఆధారం. ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల వేళ ఆమె ఒకటే అడుగుతోంది. నాకు ఇంత ముద్ద అన్నం పెట్టేవారెవరు.. వారికే నా ఓటు అని.
 
ఉత్తరప్రదేశ్‌లో రేపు చివరి విడత పోలింగ్‌ జరుగుతోంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఈ పోలింగ్‌ గురించి కాదు. ఎప్పుడో జరిగిపోయిన నాల్గవ విడత పోలింగ్‌ గురించి! ఆ విడతలో 53 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. వాటిల్లో కల్పి అసెంబ్లీ నియోజకర్గం కూడా ఉంది. అక్కడి నుంచి ఛోటేసింగ్‌ (బి.ఎస్‌.పి.), నరేంద్రపాల్‌ సింగ్‌ (బి.జె.పి.), ప్రస్తుత ఎమ్మెల్యే ఉమాకాంతి (కాంగ్రెస్‌) పోటీ చేశారు. ప్రజలకు వీళ్లు ఎలాంటి హామీలు ఇచ్చారో కానీ, ఈ ముగ్గురిలో ఎవరైతే తనకు ఇంత ముద్ద పెడతారో వారికే నా ఓటు అని మూలాదేవి అనే ఓటరు పోలింగ్‌కి ముందే చెప్పేశారు.
 
మూలాదేవిది కల్పి నియోజకవర్గంలోని షేక్‌పూర్‌గూడా గ్రామం. 70 ఏళ్ల ఈ వృద్ధురాలు దాదాపుగా ఆకలితో మరణించే స్థితిలో ఉన్నట్లు అక్కడి కరువు గ్రామాలపై సర్వేచేసిన ‘బుందేల్‌ఖండ్‌ దళిత్‌ అధికార్‌ మంచ్‌’ అనే ఎన్జీవో ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఒక నిరుపేద... ఆకలిబాధతో కడుపు చేతపట్టుకోవడం మన దేశంలో ఎప్పుడూ ఉండే విషాదమే. కానీ మూలాదేవి వేరు. మీర్జాపూర్‌ ఎంపీ అయిన ఫూలన్‌దేవి తల్లి ఆమె! అయితే పదిహేడేళ్ల క్రితం ఫూలన్‌ని ఆమె ఎంపీగా ఉన్నప్పుడే ఆమె విరోధులు ఢిల్లీలో కాల్చి చంపారు. అప్పటి నుంచి మూలాదేవి ‘పూలన్‌ తల్లి’గా ప్రత్యేక హోదాను కోల్పోయారు. ఉన్న కొద్దిపాటి భూమినీ కబ్జాదారులు తన్నుకుపోయారు. మూలాదేవి, ఆమె చిన్న కూతురు రామ్‌కలి ఇప్పుడు చిరుగుల డేరాలాంటి పూరి గుడిసెలో  ఉంటున్నారు. 
 
రామ్‌కలిలో ఫూలన్‌ పోలికలు ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో లబ్ది పొందడానికి కొన్ని పార్టీలు రామ్‌కలిని స్టేజ్‌ ఎక్కిస్తుంటాయి. అప్పుడు మాత్రం ఇంతో అంతో ఆమె చేతిలో పెడతుంటాయి. మిగతా అప్పుడు ఆ ఇంట్లో ఈ ఇంట్లో గిన్నెలు కడిగి రామ్‌కలి కొంత డబ్బు సంపాదించుకొస్తుంది. అదే వారి కుటుంబానికి ఆధారం. రామ్‌కలికి టిక్కెట్‌ ఇస్తానని ములాయం సింగ్‌ హామీ ఇచ్చారు కానీ, అదీ జరగలేదు. చూడాలి ఇక్కడ ఎవరు గెలుస్తారో గెలిచినవారు మూలాదేవికి ఇంత ముద్ద పెడతారో లేదో! అధికారంలోకి వచ్చిన వారెవరైనా ముందు చేయవలసిన పని అదే కదా.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారా లోకేష్ బాబుకు ఇలా మొదలైంది... చంద్రబాబుకు అలా మొదలైంది... ఏంటవి?