అగ్ని క్షిపణితో చైనాకు ముచ్చెమటలు.. పరిమితుల్ని ఉల్లంఘించిందంటూ గగ్గోలు
భారత ఆర్మీ ఇటీవల విజయవంతంగా ప్రయోగించి అగ్ని క్షిపణి శత్రుదేశం చైనాకు ముచ్చెమటలు పోయిస్తోంది. దీంతో భారత్ పరిమితుల్ని ఉల్లంఘించిందంటూ గగ్గోలు పెడుతూ.. ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లింది.
భారత ఆర్మీ ఇటీవల విజయవంతంగా ప్రయోగించి అగ్ని క్షిపణి శత్రుదేశం చైనాకు ముచ్చెమటలు పోయిస్తోంది. దీంతో భారత్ పరిమితుల్ని ఉల్లంఘించిందంటూ గగ్గోలు పెడుతూ.. ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లింది.
ఇటీవల చైనా భూభాగాన్ని సైతం ఛేదించగల అగ్ని-4, అగ్ని-5 క్షిపణి పరీక్షల్ని భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. దీనిపై చైనా అధికార పత్రిక గ్లోబల్‌టైమ్స్ విమర్శనాత్మకమైన కథనాన్ని ప్రచురించింది.
దీంతో మేల్కొన్న చైనా... అణ్వాయుధాలు, దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధిపై ఐరాస విధించినపరిమితుల్ని భారత్ ఉల్లంఘించిందంటూ ఆరోపణలు చేస్తోంది.
ప్రస్తుత సమయంలో అణ్వాయుధాల అభివృద్ధిలో పాకిస్థాన్‌కూ హక్కులుంటాయనీ, ప్రపంచమంతా ఇదేధోరణిని అనుసరిస్తే, చైనా కూడా చేస్తుందని ప్రకటించింది. అదేసమయంలో భారత్ అభివృద్ధి తమకు ముప్పని చైనీయులు భావించనవసరంలేదని భరోసా ఇచ్చింది.