అమెరికాలోని హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్..(వీడియా)

గురువారం, 16 మే 2019 (15:58 IST)
న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో ఓ హెలికాప్టర్ కూలింది. ఈ ఘటన నిన్న చోటుచేసుకుంది. మాన్‌హట్టాన్ నుండి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే హెలికాప్టర్ కుప్పకూలింది. కాగా ఈ ఘటనలో ఎవరూ మరణించడం గానీ తీవ్రగాయాలపాలవడం గానీ జరగలేదు. 
 
అయితే అందులోని పైలట్‌కు, డాక్ వర్కర్‌కు మాత్రం స్వల్పంగా గాయాలైనట్లు పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ అదుపు తప్పి హడ్సన్ నదిలో పడిపోవడాన్ని చూసిన పలువురు ప్రత్యక్ష సాక్ష్యులు ఆ సన్నివేశాన్ని కెమెరాలో బంధించి, ఆ వీడియోని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రియుడిని పెళ్లాడేందుకు భర్త సంతకాన్ని ఫోర్జరీ చేసిన భార్య... ఎక్కడ?