Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నబిడ్డ ఆస్పత్రిలో వుంటే.. కన్నతల్లి ఓ యువకుడితో శృంగారంలో...?

Advertiesment
కన్నబిడ్డ ఆస్పత్రిలో వుంటే.. కన్నతల్లి ఓ యువకుడితో శృంగారంలో...?
, సోమవారం, 29 జులై 2019 (14:36 IST)
మాతృత్వానికి ప్రతీక స్త్రీ. తల్లి అనేందుకు పరిపూర్ణ స్వరూపం మహిళ. అలాంటి తల్లి గొప్పతనాన్ని గుర్తించని వారుండరు. అయితే ఇక్కడ ఓ మహిళ మాత్రం మాతృత్వానికి మచ్చ తెచ్చింది.


భర్త వదిలేశాడని.. వ్యభిచారానికి అలవాటుపడిన ఓ మహిళ తన కన్నబిడ్డలను హతమార్చించింది. పురుషులను ఇంటికి పిలిపించుకుని వ్యభిచారం చేద్దామనుకుంటే పిల్లలు అడ్డుగా వున్నారని భావించిన ఆ కిరాతకురాలు.. ఇద్దరు పిల్లల్ని హతమార్చింది. ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌కు చెందిన ఓ లూయిసీ పోర్టన్ అనే 23 ఏళ్ల మోడల్ బర్మింగ్‌హామ్‌లో నివసిస్తోంది. ఆమెకు వేరే మగాళ్లతో అక్రమ సంబంధాలు ఉన్నట్లు తెలియడంతో భర్త ఆమెకు దూరమయ్యాడు.

అప్పటికి లూయిసీకి ఇద్దరు పిల్లలు. దాంతో తనకు లభించిన స్వేచ్ఛను లూయిసీ దుర్వినియోగం చేసుకుంది. తాను వేరే మగాళ్లను ఇంటికి తీసుకొచ్చుకోవడానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని ఎప్పుడూ కోప్పడేది. 
 
మూడేళ్ల పెద్ద కూతురు లెక్సిని విపరీతంగా హింసించింది. ఒకరోజు ఆమె కొట్టిన దెబ్బలకు లెక్సి స్పృహ తప్పింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లిన లూయిసీ.. కుమార్తె ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉంటే వేరే యువకుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొంది. అతనితో శృంగారంలో పాల్గొన్నాక నగ్నంగా ఫొటోషూట్‌లో పాల్గొంది. ఆ ఫొటోలను వేరే వారికి అమ్ముకొంది. 
 
కుమార్తె ఆరోగ్యం కుదుటపడగానే.. కొన్నిరోజుల్లో లెక్సిని హతమార్చింది. ఆమెను పూడ్చి పెట్టే సమయంలో కూడా లూయిసీ నవ్వినట్లు కొందరు చెప్పారు. ఈ ఘటన మరువక ముందే 18 నెలల రెండో కూతుర్ని కూడా లూయిసీ చంపేసింది. ఈ హత్యలపై స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు లూయిసీని అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉన్నావ్ అత్యాచారం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు, కావాలనే చేయించారా?