మాలీ సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాలపై మోటార్ సైకిళ్లపై వచ్చిన ముష్కరులు ఊచకోతకు పాల్పడ్డారు. 23 నైజర్ గ్రామాలపై ముష్కరుల దాడిలో 137 మంది మృతి నైజర్లో తీవ్రవాదులు రెచ్చిపోయారు.
ఆదివారం జరిగిన ఈ ఘటనలో 137 మంది మరణించినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇస్లామిక్ తీవ్రవాదులే ఈ ఘటనకు కారణమని భావిస్తోంది. నైజర్ కొత్త అధ్యక్షుడిగా మహ్మద్ బజౌమ్ ఎన్నిక నేపథ్యంలో ఈ దాడి జరిగింది.
ఫిబ్రవరిలో జరిగిన ఈ ఎన్నికల్లో మహ్మద్ గెలిచినట్లు.. నైజర్స్ కాన్స్టిట్యుషనల్ కోర్టు ఆదివారమే అధికారికంగా ప్రకటించింది. పొరుగున ఉన్న మాలీలో ఇస్లామిక్ తిరుగుబాటు ప్రభావం నైజర్పై పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ బజౌమ్ ఏప్రిల్ 2న బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ తరుణంలోనే ముష్కరులు తెగబడ్డారు. జనవరిలోనూ ఇలాంటి దాడే జరిగింది. అప్పుడు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వారం క్రితం మార్కెట్కు వెళ్లి తిరిగి వస్తున్న ఓ సమూహంపైనా తీవ్రవాదులు దాడి చేయగా.. 66 మంది చనిపోయారు.