Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనాపై పోరు.. గ్రెటాకు సమానమైన విరాళం.. ఎంతో తెలుసా?

Advertiesment
కరోనాపై పోరు.. గ్రెటాకు సమానమైన విరాళం.. ఎంతో తెలుసా?
, గురువారం, 30 ఏప్రియల్ 2020 (17:46 IST)
కరోనాపై పోరుకు పర్యావరణ కార్యకర్త గ్రెట్ థన్‌బర్గ్  భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు లక్ష డాలర్ల భారీ విరాళం ప్రకటించింది. హ్యూమెన్ యాక్ట్ అనే స్వచ్ఛంధ సంస్థ తనకు ఇచ్చిన లక్ష డాలర్ల బహుమానాన్ని యూనినెఫ్‌కు బదలాయిస్తున్నట్టు గ్రెటా తెలిపింది. కరోనా సంక్షోభం ప్రస్తుతం పిల్లలపై పెను ప్రభావం చూపిస్తోందని, దీర్ఘ కాలంలో బలహీన వర్గాలన్నీ దీని బారినపడతాయని గ్రెటా వ్యాఖ్యానించింది. 
 
వాతావరణం మార్పుల లాగానే కరోనా మహమ్మారి బాలల హక్కుల సంక్షోభానికి దారితీస్తోంది. నాతో పాటూ యూనిసెఫ్‌కు అందరూ  తోడ్పాటును అందించాలని గ్రెటా పిలుపు నిచ్చింది. చిన్నారుల చదువుల్ని, ఆరోగ్యాల్ని, వారి జీవితాల్ని కాపాడేందుకు మనందం నడుం బిగించాలని కోరింది. 
 
ఇకపోతే గ్రెటా విరాళంపై యూనీసెఫ్ స్పందించింది. లాక్‌డౌన్ల కారణంగా భాధ్యతల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు గ్రెటా సహాయం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపింది. మరోవైపు..గ్రెటాకు బహుమానం ఇచ్చిన హ్యూమన్ యాక్ట్ కూడా గ్రెటా బహుమతితో సమానమైన విరాళాన్ని ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలోని వలస కూలీలకు బిగ్ రిలీఫ్...