Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Google AI Hub in Vizag, ప్రధాని మోడికి సుందర్ పిచాయ్ ఫోన్

Advertiesment
Sundar Pichai and Narendra Modi

ఐవీఆర్

, మంగళవారం, 14 అక్టోబరు 2025 (13:56 IST)
కర్టెసి-ట్విట్టర్
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి పునాదులు ఒక్కొక్కటిగా పడుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం నాడు విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం గూగుల్ తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపధ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడికి ఫోన్ చేసి తమ కంపెనీ విశాఖపట్టణంలో చేపట్టనున్న భవిష్యత్ ప్రణాళికలు గురించి వివరించారు. 
 
ఈ విషయాలను ఆయన తన ఎక్స్ పేజీలో ప్రస్తావించారు. విశాఖలో గూగుల్ తొలి ఏఐ హబ్ కు సంబంధించిన ప్రణాళికలను ప్రధాని మోడికి వివరించాను. ఈ హబ్ లో గిగావాట్ సామర్థ్యం వుండే పైపర్ స్కేల్ డేటా సెంటర్, అంతర్జాతీయ సబ్ సీ గేట్ వే, భారీస్థాయి ఇంధన మౌలిక సదుపాయాలు వుంటాయి. ఈ కేంద్రంతో అధునాతన సాంకేతికతను భారతదేశం సంస్థలు, వినియోగదారులకు అందించనున్నాము. ఏఐ ఆవిష్కరణలను మరింత వేగవంతం చేస్తామని సుందర్ పిచాయ్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల రైతులకు శుభవార్త... దీపావళి కానుక PMKSY నిధులు విడుదల