Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వామ్మో, గాలిలో వుండగా విమానం ఇంజిన్‌లో మంటలు, అందులో 273 మంది ప్రయాణికులు (video)

Advertiesment
Boeing 757 Catches Fire at Mid-Air

ఐవీఆర్

, సోమవారం, 18 ఆగస్టు 2025 (20:44 IST)
బోయింగ్ విమానం ఘోర ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ తప్పించుకుంది. బోయింగ్ 757-300 విమానంలో ఉన్న 273 మంది శనివారం రాత్రి గ్రీస్‌లోని కార్ఫు నుండి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం కుడి ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో దాదాపు మృత్యువు ముఖం దాకా వెళ్లి వచ్చారు. ఐతే విమానం అత్యవసరంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ సురక్షితంగా ప్రాణాలతో బైటపడ్డారు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జర్మన్ బడ్జెట్ క్యారియర్ కాండోర్ నడుపుతున్న బోయింగ్ విమానం 757-300 జర్మనీ నుంచి డస్సెల్‌డార్ఫ్‌కు 273 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బందితో బయలుదేరింది. కోర్ఫు విమానాశ్రయం నుండి బయలుదేరిన గంట తర్వాత ఇటలీలోని బ్రిండిసి పట్టణంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దానికి కారణం.. ఓ పక్షుల గుంపు నుంచి విమానం వెళ్లడంతో కుడివైపు ఇంజిన్ నుంచి మంటలు కనిపించాయి. 
 
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 18 సెకన్ల క్లిప్‌లో కుడి ఫ్యూజ్‌లేజ్ నుండి మంటలు చెలరేగడం కనిపిస్తోంది. అనుమానిత పక్షి ఢీకొనడం వల్ల ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానం నుంచి మంటలు వచ్చాయనీ, దాంతో విమానాన్ని దక్షిణ ఇటలీలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు చెబుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా