బాత్రూంలోకి వెళ్లి గన్ లోడ్ చేసి... ఫ్లోరిడా ఎయిర్ పోర్టులో మాజీ సైనికుడి కాల్పులు... 5 మంది మృతి
ఫోర్ట్ లాడర్‌డేల్ ఎయిర్ పోర్టులో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఇరాక్ మాజీ సైనికుడిగా భావిస్తున్న అతడు బ్యాగులు చెక్ చేసే ప్రాంతంలో విధ్వంసం సృష్టించాడు. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా మరో 8 మంది తీవ్
ఫోర్ట్ లాడర్‌డేల్ ఎయిర్ పోర్టులో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఇరాక్ మాజీ సైనికుడిగా భావిస్తున్న అతడు బ్యాగులు చెక్ చేసే ప్రాంతంలో విధ్వంసం సృష్టించాడు. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడు కాల్పులు జరిపిన తర్వాత గన్ కిందికి విసిరేసినట్టు ప్రత్యక్షసాక్షుల సమాచారం. కాల్పులు జరిపిన వ్యక్తిని 26 యేళ్ల ఎస్టాబన్ శాంటిగోగా గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు.
ఇరాక్ నేషనల్ గార్డ్‌గా పనిచేసిన అతడిని.. సరిగా పనిచేయని కారణంగా గతేడాది ఉద్యోగంలో నుంచి ఉద్వాసనకు గురైనట్టు తెలిపారు. విమాన ప్రయాణికులకు ఆయుధాలు వెంట తీసుకు వెళ్లేందుకు చట్టపరంగా అనుమతి ఉన్నప్పటికీ... వాటిని అన్‌లోడ్ చేసి బ్యాగులో పెట్టి తనిఖీ అధికారులకు తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది.
శుక్రవారం కాల్పులకు జరిపిన దుండగుడు కేవలం తన బ్యాగులో అన్‌లోడ్ చేసిన గన్ మాత్రమే తెచ్చుకున్నాడు. తీరా లోపలికి వచ్చిన తర్వాత బాత్రూంలోకి వెళ్లి గన్ లోడ్ చేసుకుని తిరిగివచ్చి విచ్చల విడిగా కాల్పులకు తెగబడ్డాడు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న శాంటిగోని అధికారులు విచారిస్తున్నారు.