Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదు.. చిత్రహింసలు పెట్టడంతో మృతి చెందారట..

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై ఎన్నో ఊహాగానాలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబోస్ మృతిపై మరో అంశం తెరపైకి వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మృతి చెందారనేది చాలామంది వాదన. విమాన ప్రమాదంలో మృత

Advertiesment
నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదు.. చిత్రహింసలు పెట్టడంతో మృతి చెందారట..
, శనివారం, 7 జనవరి 2017 (11:10 IST)
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై ఎన్నో ఊహాగానాలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబోస్ మృతిపై మరో అంశం తెరపైకి వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మృతి చెందారనేది చాలామంది వాదన. విమాన ప్రమాదంలో మృతి చెందారనేది చాలామంది వాదన. అయితే అది సరికాదని, నేతాజీ విమాన ప్రమాదంలో మృతి చెందలేదని తాజాగా విడుదలైన ఓ పుస్తకం తెలిపింది. 
 
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలో చనిపోలేదని, సోవియట్‌ యూనియన్‌లో బ్రిటిష్‌ అధికారుల ఇంటరాగేషన్‌లో చిత్రహింసల వల్ల మృతి చెందారని తాజా వాదన వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ జీడీ బక్షీ రాసిన 'బోస్‌- ది ఇండియన్ సమురాయ్‌' పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 
 
సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని.. సోవియట్ యూనియన్‌లో బ్రిటిష్ అధికారులు పెట్టిన చిత్రహింసల వల్లే ఆయన ప్రాణాలు విడిచారని అందులో బక్షి తన పుస్తకంలో పేర్కొన్నారు. జపాన్ నుంచి తప్పించుకున్న సుభాష్ చంద్రబోస్ అక్కడి నుంచి సైబీరియా చేరుకుని ఆజాద్ హింద్ ప్రభుత్వ ఎంబసీని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్‌ అధికారులు.. ఆయన్ని విచారణ కోసమంటూ చిత్ర హింసలు గురిచేశారు. అధికారుల చిత్ర హింసలు భరించలేకే నేతాజీ మృతి చెందారని పుస్తకంలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళకు కష్టాలే: అన్నాడీఎంకేను కైవసం చేసుకోవాలో? కొత్త పార్టీ పెట్టాలో? ఇంకా నిర్ణయం తీసుకోలేదు.