Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జర్నలిస్టుల మెదళ్లను మందగింపజేస్తున్న ఆల్కహాల్, కెఫీన్.. పనిపట్ల మక్కువే వారిని చురుగ్గా ఉంచుతోందా?

ప్రపంచవ్యాప్తంగా అతిగా ఆల్కహాల్, కెఫీన్ సేవించడమే జర్నలిస్టుల మెదళ్లను మొద్దుబారేలా చే్స్తోందట. అయితే అదే సమయంలో తమ పని పట్ల మక్కువ వారిని మాససికంగా చురుగ్గా ఉంచుతోందని అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు ప్రకటిస్తున్నారు.

Advertiesment
జర్నలిస్టుల మెదళ్లను మందగింపజేస్తున్న ఆల్కహాల్, కెఫీన్.. పనిపట్ల మక్కువే వారిని చురుగ్గా ఉంచుతోందా?
హైదరాబాద్ , సోమవారం, 22 మే 2017 (06:09 IST)
ప్రపంచవ్యాప్తంగా అతిగా ఆల్కహాల్, కెఫీన్ సేవించడమే జర్నలిస్టుల మెదళ్లను మొద్దుబారేలా చే్స్తోందట. అయితే అదే సమయంలో తమ పని పట్ల మక్కువ వారిని మాససికంగా చురుగ్గా ఉంచుతోందని అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు ప్రకటిస్తున్నారు. సమాజంలోని ఇతరులతో పోల్చి చూస్తే జర్నలిస్టుల మెదళ్లు తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ఎంఐటీకి చెందిన ప్రొఫెసర్ తారా స్వార్ట్ చెబుతున్నారు. భావోద్వేగాలను క్రమబద్దీకరించడంలో, పక్షపాతాన్ని అధిగమించడంలో, సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో, వెసులుబాటుతో ఆలోచించడంలో, సృజనాత్మకంగా ఉండటంలో మెదడుకున్న సామర్థ్యం జర్నలిస్టుల్లో తక్కువగా ఉంటోందని తారా స్వార్ట్ చెప్పారు. 
 
జర్నలిస్టుల మెదడు పనిచేసే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఎంఐటీ పరిశోధకులు 31 మంది జర్నలిస్టులను అధ్యయనానికి ఎంచుకున్నారు. వీరికి రక్త పరీక్షలు నిర్వహించారు. గుండె కొట్టుకునే స్థాయిలో తారతమ్యాలను చూపించే మోనిటర్‌ని వీరి శరీరానికి అనుసంధానం చేశారు. మెదడుకు మేత పెట్టే ప్రశ్నావళిని ఇచ్చి సమాధానాలు రాబట్టారు. వారి ఆహారం మరియు డ్రింకింగ్ అలవాట్లను నమోదు చేశారు. ఈ వివరాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత, సగటు జనాభా కంటే తక్కువ స్థాయిలో జర్నలిస్టుల మెదడు పనిచేస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు. అతిగా ఆల్కహాల్‌ను, చక్కెరను, కెఫీన్‌ను సేవించడంతో సహా అనేక అంశాలు దీనికి కారణమవుతున్నాయని వీరు చెప్పారు. 
 
జర్నలిస్టుల్లో 41 శాతం మంది వారానికి 18 లేదా అంతకంటే ఎక్కువ యూనిట్ల ఆల్కహాల్‌ను సేవిస్తున్నారని అంచనా. పైగా జర్నలిస్టుల మెదడు పనితీరును నీరు తాగకపోవడం -డిహైడ్రేషన్- కూడా ప్రభావితం చేస్తోందని అంటున్నారు. ఎందుకంటే పని ఒత్తిడిలో మునుగుతున్న జర్నలిస్టుల్లో 5 శాతం కంటే తక్కువ మందే తమ శరీరానికి అవసరమైనంత మేరకు మంచినీరు తాగుతున్నారని అంచనా. 
 
అదే సమయంలో పని ఒత్తిడి జర్నలిస్టుల పని సామర్థ్యాన్ని ప్రభావితం చేయడం లేదట. ఎందుకంటే తాము చేస్తున్న పని అర్థవంతంగానూ, ప్రజలకు ఉపయోగపడే లక్ష్యంతోనూ ఉందని జర్నలిస్టులు ప్రగాఢంగా భావిస్తున్నారు. అందుకే ఇతర వృత్తులతో పోలిస్తే పని ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కుంటున్న జర్నలిస్టులు క్రమంగా తమ మానసిక సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటున్నారని పరిశోధన నిర్ధారించింది.
 
బ్యాంక్ ఉద్యోగులు, వర్తకులు, టెలికామ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు వంటి ఇతర వృత్తి నిపుణులు జర్నలిస్టులతో పోలిస్తే ఒత్తిళ్లను ఎదుర్కోలేకపోతున్నారని  ఈ పరిశోధన చెబుతోంది. చేస్తున్న పని ప్రాముఖ్యత, లక్ష్యం అనేవి వ్యక్తుల మానసిక సామర్థ్యాన్ని పెంచడంపై ప్రభావం కలిగిస్తున్నాయి. జర్నలిస్టులు అత్యున్నత పనివిధానాన్ని సాధించాలంటే ఆల్కహాల్, చక్కెర్, కెఫీన్ వంటివి తీసుకోవడం తగ్గించుకుంటే, అంటే తమ అలవాట్లను కాస్త మార్పు చేసుకుంటే చాలని, దీంతో వారి మెదడు పని చేసే తీరు మెరగవతుందని ఎంఐటీ ప్రొఫెసర్ తారా స్వార్ట్ చెప్పారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రోగ్ వంటగాడికి మన ప్రియాంక వంట నచ్చలేదుట, కుక్కలు తినే వంట అంటూ అవమానించిన శ్వేత జాతి దురహంకారం.