Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ రోగ్ వంటగాడికి మన ప్రియాంక వంట నచ్చలేదుట, కుక్కలు తినే వంట అంటూ అవమానించిన శ్వేత జాతి దురహంకారం.

బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసి హాలీవుడ్‌కు పరిచయమై ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ప్రియాంక చోప్రా వంటను ఓ చెఫ్‌ వెక్కిరించాడు. అది కూడా ప్రియాంకా చేసిన వంట కుక్కలకు పెట్టేదిలా ఉందని. జోర్డన్‌ రామ్సే.. ఓ బ్రిటీష్‌ సెలబ్రెటీ చెఫ్‌. ఆయన వంటలు నలభీమ

Advertiesment
ఆ రోగ్ వంటగాడికి మన ప్రియాంక వంట నచ్చలేదుట, కుక్కలు తినే వంట అంటూ అవమానించిన శ్వేత జాతి దురహంకారం.
హైదరాబాద్ , సోమవారం, 22 మే 2017 (02:09 IST)
బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసి హాలీవుడ్‌కు పరిచయమై ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ప్రియాంక చోప్రా వంటను ఓ చెఫ్‌ వెక్కిరించాడు. అది కూడా ప్రియాంకా చేసిన వంట కుక్కలకు పెట్టేదిలా ఉందని. జోర్డన్‌ రామ్సే.. ఓ బ్రిటీష్‌ సెలబ్రెటీ చెఫ్‌. ఆయన వంటలు నలభీమ పాకంలో ఉంటాయి అంటారు చాలా మంది సెలబ్రిటీలు. రామ్సే వంట ఎంత బాగా చేస్తాడో ఇతరులు చేసే వంటకాలను అంతే ఆక్షేపిస్తూ ఉంటాడు. రామ్సే తాజాగా మన ప్రియాంక చోప్రా చేసిన వంటపై కామెంట్‌ చేశాడు. ప్రియాంక తన హాలీవుడ్‌ ప్రాజెక్టుల కోసం ఏడాదిగా అమెరికాలో ఉంటున్న సంగతి తెలిసిందే.
 
హాలీవుడ్‌ ప్రాజెక్టుల కోసం ప్రియాంక ఏడాదిగా అమెరికాలో ఉంటోన్న ప్రియాంక చోప్రా ఈ నేపథ్యంలో లాస్ ఎంజెల్స్‌లో ఓ టాక్‌ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రియాంక సరదాగా కిచిడి, చికెన్‌ సూప్‌ చేసి సదరు షోలో చూపించింది. ఆ షోలో రామ్సే కూడా ఉన్నాడు. ప్రియాంక వండింది రుచి చూసి కనీసం ఆమె కూడా ఓ సెలబ్రెటీనే అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ‘ఛీ.. ఇది కుక్కకు పెట్టే ఫుడ్‌లా ఉంది’ అనేశాడు. అంతే ఒక్కసారిగా ప్రియాంక అభిమానులు రామ్సేపై ట్వీటర్‌ అస్త్రాన్ని ప్రయోగించారు. ప్రియాంకను అంత మాట అంటావా? అంటూ తిట్టి పోశారు. అయితే, రామ్సే కామెంట్‌పై ప్రియాంక చోప్రా ఇంకా స్పందించలేదు.
 
తనపై అంత ఘోరమైన కామెంట్ చేసినా కిమ్మకకుండా భరించి ఊరుకున్న ప్రియాంక భారతీయ సంస్కారాన్ని తన మౌనం ద్వారా ప్రదర్శించగా, ఆ శ్వేత జాతి కుక్క, ఆ బ్రిటిష్ సెలబ్రిటీ చెఫ్ యుగాలు మారినప్పటికీ తమలో మారని తెల్లజాతి హైన్యాన్ని తన వ్యాఖ్య ద్వారా అలా ప్రదర్శించాడు. నక్కకు నాగలోగానికి ఉన్న తేడా ఇదే మరి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తలకు హెల్మెట్ లేకుంటే పెట్రోల్ కట్ : యూపీ సీఎం యోగీ మార్క్ రూలింగ్