Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

Advertiesment
Baby Gorilla

సెల్వి

, సోమవారం, 23 డిశెంబరు 2024 (23:09 IST)
Baby Gorilla
ఇస్తాంబుల్ విమానాశ్రయంలో గొరిల్లాను అధికారులు తనిఖీల్లో కనుగొన్నారు. అంతర్జాతీయ వన్యప్రాణుల రక్షణ ఒప్పందాల ప్రకారం ప్రమాదకర స్థితిలో ఆ గొరిల్లాను రక్షించారు. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ బృందాలు కార్గో షిప్‌మెంట్‌లో బేబీ గొరిల్లాను కనుగొన్నారు.
 
వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఇస్తాంబుల్ విమానాశ్రయంలో కార్గోను తనిఖీ చేశాయి. కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్మగ్లింగ్-ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు నైజీరియా నుండి బ్యాంకాక్‌కు వెళ్లే రవాణాను ట్రాక్ చేశారు. వన్యప్రాణులు రక్షించడంలో భాగంగా తదుపరి తనిఖీ కోసం వారు కార్గోను పరిశీలించారు. ఈ  అధికారులు బోనులో గొరిల్లా శిశువును కనుగొన్నారు. 
 
కస్టమ్స్ ఆపరేషన్ తర్వాత రక్షించబడిన గొరిల్లా శిశువుకు వన్యప్రాణుల నిపుణులు తగిన చికిత్సతో సంరక్షిస్తారు. సరైన పత్రాలు లేకుండా అక్రమంగా రవాణా చేస్తుండగా కస్టమ్స్ తనిఖీల్లో ఈ బేబీ గొరిల్లాను స్వాధీనం చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025, లగ్జరీ మొబిలిటీని చాటిచెప్పనున్న లెక్సస్ ఇండియా