Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో నవంబర్ 3న ఎన్నికలు.. వచ్చే వారం నుంచి లాక్ డౌన్ సడలింపులు

Advertiesment
Elections
, శుక్రవారం, 1 మే 2020 (16:00 IST)
అమెరికాలో షెడ్యూల్ ప్రకారమే ఈ ఏడాది నవంబర్ 3 న ఎన్నికలు జరుగుతాయని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ స్పష్టం చేశారు. కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తగ్గకపోయినప్పటికీ అమెరికాలో లాక్ డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ట్రంప్ నిర్ణయించారు.

ముఖ్యంగా డొమెస్టిక్ ట్రావెల్స్ కు వచ్చే వారం నుంచి అనుమతి ఇస్తామని చెప్పారు. వైట్ హౌజ్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్…దేశంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాల్సి ఉందన్నారు.

వచ్చే వారమే ఆరిజోనా స్టేట్ లో పర్యటిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా ఎఫెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ట్రంప్ వాష్టింగన్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లటంతో ఇదే మొదటిసారి. వ్యాపారాలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలు కొనసాగిస్తేనే మళ్లీ దేశం గాడిలో పడుతుందని చెప్పారు.

వ్యాక్సిన్ ఉన్న లేకున్నా ట్రంప్ కరోనా దానంతటే అది పోతుందని ట్రంప్ చెప్పారు. ఐతే అమెరికాలో కరోనా ఎఫెక్ట్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు 61, 361 మంది కరోనాతో చనిపోయారు. పది లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

కరోనా ఉన్నా క్యాంపెయిన్
అమెరికాలో కరోనా వణికిస్తున్న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా ఎఫెక్ట్ తో ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అన్న అనుమానం ఉన్నప్పటికీ ట్రంప్ మాత్రం క్యాంపెయిన్ కు రెడీ అయిపోతున్నారు.

ఎలక్షన్స్ వాయిదా వేయాలని ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ కోరినప్పటికీ ఆయన డోంట్ కేర్ అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా త్వరలోనే ఆయన ఒహాయో రాష్ట్రంలోనూ పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి వైట్ హౌజ్ అధికారులు వివరాలు వెల్లడించారు.

వైరస్ ప్రభావం ఎక్కువగా లేని రాష్ట్రాల్లో ముందుగా మీటింగ్ లు నిర్వహించాలని భావిస్తున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ లాంటి ప్రాంతాల్లో మినహా అమెరికాలోని మిగతా రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ పెద్దగా లేదు. దీంతో అసలు అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం లేదని ట్రంప్ భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారమే ఈ ఏడాది నవంబర్ 3 న ఎన్నికలు జరుగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు.
 
ఎన్నికలు అమెరికా అంతర్గత వ్యవహారం:  చైనా
చైనా అధినాయకత్వానికి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడంలేదు. వచ్చే ఎన్నికల్లో తన ఓటమికి చైనా కుయుక్తులు పన్నుతోందని, తన ప్రత్యర్థులకు సహకరిస్తోందని ట్రంప్ తీవ్ర ఆరోపణలు గుప్పించడం తెలిసిందే.

తాజాగా ట్రంప్ వ్యాఖ్యలను చైనా ఖండించింది. తమకు అంత ఆసక్తి లేదని స్పష్టం చేసింది. ఎన్నికలు అమెరికా అంతర్గత వ్యవహారం అని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తమ ప్రాధాన్యతాంశం కాదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

అమెరికా ఎన్నికల రాజకీయాల్లోకి తమను లాగడం ఎందుకని ప్రశ్నించారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో విఫలమై, ఆ అసహనాన్ని చైనాపై ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ట్రంప్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో గేట్ పరీక్ష కోసం ఆన్లైన్ తరగతులు