ఇరాన్‌లోని సీసాఖత్ పట్టణ సమీపంలో బుధవారం రాత్రి 10.05 గంటలకు భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారని ఇరాన్ అధికారులు చెప్పారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైందని తెలిపారు.
భూకంపం వల్ల విద్యుత్, మంచినీటి సరఫరాల్లో అంతరాయం వాటిల్లింది. భూకంపం సంభవించిన అనంతరం సీసాఖత్, యాసుజ్ పట్టణాల్లోని ప్రజలు భయంతో ఇళ్లు వదిలిపెట్టి వెళ్లారు.
భూకంపం అనంతరం ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశామని అధికారులు చెప్పారు. సహాయ బృందాలు, అంబులెన్సులను రంగంలోకి దించి సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. భూకంపం పది కిలోమీటర్ల లోతులో వచ్చిందని అధికారులు చెప్పారు.