Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భూమి కథ ఎలా ముగుస్తుందంటే? ఆ నక్షత్రం ధ్వంసమైతే.. 200 కాంతి సంవత్సరాల దూరంలో?

ఓజోన్ పొరలో ఏర్పడిన మార్పుల కారణంగా ప్రకృతీ వైపరీత్యాలు పెచ్చరిల్లిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూమి కథ ఎలా ముగుస్తుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. మనకు 200 కాంతి సంవత్స

Advertiesment
Earth
, మంగళవారం, 13 డిశెంబరు 2016 (12:41 IST)
ఓజోన్ పొరలో ఏర్పడిన మార్పుల కారణంగా ప్రకృతీ వైపరీత్యాలు పెచ్చరిల్లిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూమి కథ ఎలా ముగుస్తుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. మనకు 200 కాంతి సంవత్సరాల దూరంలో 'ఎల్‌2 పుపిన్స్‌'గా పిలిచే ఓ భారీ నక్షత్రముంది. వెయ్యికోట్ల ఏళ్ల నాటి ఈ నక్షత్రం ప్రస్తుతం ధ్వంసమవుతోంది. ఈ ప్రక్రియను శక్తిమంతమైన టెలిస్కోప్‌లతో బెల్జియంలోని కేయూ ల్యూవెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోనమీ నిపుణులు పరిశీలిస్తున్నారు. 
 
ఈ నక్షత్రం 500 కోట్ల ఏళ్ల క్రితం అచ్చం మన సూర్యుడిలానే ఉండేది. దీన్ని పరిశీలిస్తుంటే.. మరో 500 కోట్ల ఏళ్ల తర్వాత సూర్యుడు ప్రస్తుతమున్న దానికంటే వంద రెట్లు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా భారీ స్థాయిలో ద్రవ్యరాశి, తీవ్రమైన సౌర పవనాలు పరిసరాల్లోకి వెలువడతాయి. ఇవి మన సౌర కుటుంబం స్థితిగతులను పూర్తిగా మార్చేస్తాయి. బుధుడు, శుక్రుడు, భూమి లాంటి గ్రహాలు పూర్తిగా ధ్వంసమవుతాయని పరిశోధనలో పాలుపంచుకున్న లీన్‌ డీసిన్‌ అంచనా వేశారు. 
 
ఇదిలా ఉంటే.. భూమి ఏర్పడి ఇప్పటికే 4543 బిలియన్ సంవత్సరాలు గడిచిపోయాయని అంచనా. భూమి కనిపించకపోయేందుకు ముందు మానవజాతి పూర్తిగా అంతమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనికి సంబంధించి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ కూడా వచ్చేశాయి. మానవులు, జంతువులు చనిపోయాక.. పవర్‌ ప్లాంట్స్‌, విద్యుత్‌ స్తంభించిపోయి భూమి అంతా చీకటిగా మారిపోతాయని.. ఇక కట్టడాలన్నీ ధ్వంసమవుతాయని.. నగరాలన్నీ చెత్త, ఇసుకతో నిండిపోయాయని ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ తెలియజేశాయి. 
 
అయితే భూమి మీద మనిషి తాలూకు ఆనవాళ్లు అన్నీ అంతరించిపోవడానికి కనీసం పదివేల సంవత్సరాలు కావాలని, మానవ జాతి అంతరించిపోయిన తర్వాత భూమి మరింత పచ్చదనంతో కలకలలాడుతుందట. ఇలాంటి పరిణామాలు జరుగుతాయని ఎన్నో ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో.. లండన్ పరిశోధకులు భూమి కథ ఎలా ముగుస్తుందో అనే దానిపై ప్రత్యేక పరిశోధన చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ సమాధి వద్ద హల్ చల్ చేసిన జయలలిత ఆత్మ.. సోషల్ మీడియాలో వైరల్