ప్రేయసి పడక గదిలో మరో మగాడు నగ్నంగా కనిపిస్తే... ఆ లవర్ ఏం చేశాడో తెలుసా?
సాధారణంగా ఒక వ్యక్తి ఇష్టపడే అమ్మాయి లేదా ప్రేమించే యువతిని మరో వ్యక్తి లేదా యువకుడు చూస్తే జీర్ణించుకోలేడు. విచక్షిణారహితంగా ప్రవర్తిస్తాడు. తమ ప్రేయసితో పోట్లాటకు దిగుతారు. అలాంటిది తన ప్రియురాలి పడ
సాధారణంగా ఒక వ్యక్తి ఇష్టపడే అమ్మాయి లేదా ప్రేమించే యువతిని మరో వ్యక్తి లేదా యువకుడు చూస్తే జీర్ణించుకోలేడు. విచక్షిణారహితంగా ప్రవర్తిస్తాడు. తమ ప్రేయసితో పోట్లాటకు దిగుతారు. అలాంటిది తన ప్రియురాలి పడక గదిలో ఓ పరాయి వ్యక్తి నగ్నంగా పడుకుని కనిపిస్తే... ఆ ప్రియుడు ఏం చేశాడో తెలుసా? ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ నగరంలో చోటుచేసుకుంది.
టెక్సాస్‌లో డస్టోన్ హోలోవే అనే 23 ఏళ్ల యువకుడు తన లవర్ ఏం చేస్తుందో చూడాలనుకున్నాడు. అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. లవర్ బెడ్‌రూంలో షాక్‌కు గురయ్యే దృశ్యాన్ని చూశాడు. కానీ, ఇతర వ్యక్తుల్లా కంగారుపడలేదు. ఆందోళన చెందలేదు. మద్యం సేవించి నిద్రపోతున్న యువతి బెడ్‌పైనే మరో కొత్త వ్యక్తి ఉన్నాడు. అదీ నగ్నంగా కనిపించాడు.
వెంటనే లవర్‌ని, పక్కనున్న వ్యక్తిని విచక్షిణా రహితంగా కొట్టలేదు, తిట్టలేదు. తనలోని హాస్య కోణాన్ని బయటపెట్టాడు. బెడ్‌రూంలో ఫోటో షూట్ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. వారిద్దరినీ చాలా ఫోటోలు తీశాడు. అంతేకాదు.. సెల్ఫీ కూడా దిగి ఎంజాయ్ చేశాడు. అనంతరం ఫేస్‌బుక్‌లో ఫోటోలు పోస్టు చేశాడు. ఫోటోలపై ఈ విధంగా వ్యాఖ్యానించాడు. 'మీరు ఇంటికి వచ్చేసరికి మీ ప్రియమైన లవర్ పక్కన వేరే మగాడు ఉంటే! మంచోళ్లకు మంచోళ్లే దొరుకుతారు అని భావించాలి' అని చెప్పాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.