Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీరప్పన్ నుంచి దినకరన్ దాకా.. అక్కడ అన్నీ అర్ధరాత్రి శకునాలే..

తమిళనాడులో అన్ని ఘటనలూ అర్థరాత్రి వేళే చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. పేరుమోసిన అడవి స్మగ్లర్ వీరప్పన్ మరణవార్త నుంచి రాష్ట్రంలో ఇటీవల కాలంగా అన్ని పరిణామాలు అర్ధరాత్రి వేళ సాగుతున్నాయి. అమ్మ జయలలిత ఆసుపత్రిలో చేరడం మొదలు మరణ సమాచారం బయటకు రావడం కూ

Advertiesment
వీరప్పన్ నుంచి దినకరన్ దాకా.. అక్కడ అన్నీ అర్ధరాత్రి శకునాలే..
హైదరాబాద్ , గురువారం, 27 ఏప్రియల్ 2017 (05:09 IST)
తమిళనాడులో అన్ని ఘటనలూ అర్థరాత్రి వేళే చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. పేరుమోసిన అడవి స్మగ్లర్ వీరప్పన్ మరణవార్త నుంచి రాష్ట్రంలో ఇటీవల కాలంగా అన్ని పరిణామాలు అర్ధరాత్రి వేళ సాగుతున్నాయి. అమ్మ జయలలిత ఆసుపత్రిలో చేరడం మొదలు మరణ సమాచారం బయటకు రావడం కూడా అర్ధరాత్రే చోటు చేసుకుంది. చిన్నమ్మ శిబిరానికి వ్యతిరేకంగా మాజీ సీఎం పన్నీరుసెల్వం తిరుగుబాటు అర్ధరాత్రే సాగగా, ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల రద్దు అదే బాటలో సాగింది. నాలుగు రోజుల్లో 37 గంటల పాటు సాగిన విచారణలో 50 ప్రశ్నల్ని దినకరన్‌కు ఢిల్లీ పోలీసులు సంధించారు. రెండాకుల కోసం హవాల ఏజెంట్ల ద్వారా నగదు మార్పిడి సాగించడం, ఇందుకు స్నేహితుడు మల్లికార్జున్‌ సహకారం తోడు కావడం వెరసి ప్రస్తుతం క్రిమినల్‌ అన్న ముద్రను వేసుకోక తప్పలేదు. దినకరన్‌ అరెస్టుతో తమిళనాట ఉత్కంఠ రేగ వచ్చని సర్వత్రా భావించినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. 
 
నిన్న మొన్నటి వరకు నేతగా ఉన్న శశికళ మేనల్లుడు దినకరన్‌ తాజాగా ముద్దాయి అయ్యారు. తమకు అడ్డంగా దొరికిన దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు బుధవారం కటకటాల్లోకి నెట్టారు. కోర్టు ఆదేశాలతో కస్టడీకి తీసుకున్నారు. ఈ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉండడంతో తదుపరి అరెస్టు ఎవరో అన్న ఉత్కంఠ బయలు దేరింది. అదృష్టం కలిసి రావడంతో ఇక,  అన్నాడీఎంకేకు సర్వం తానే అన్నట్టు రెండున్నర నెలలు ఓ నాయకుడిగా చక్రం తిప్పిన టీటీవీ దినకరన్‌ రాతను మంగళవారం అర్ధరాత్రి ఢిల్లీ పోలీసులు మార్చేశారు.
 
ఐదు రోజుల కస్టడీకి దినకరన్‌ను అప్పగించిన దృష్ట్యా, ఆయన్ను విచారణ నిమిత్తం చెన్నైకు తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అలాగే, పది కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చినట్టు సంకేతాలు ఉన్నా, పట్టుబడింది మాత్రం 1.3 కావడంతో మిగిలిన మొత్తం ఏమైనట్టో అని పెదవి విప్పే వారు పెరిగారు. ఇక, ఈ మొత్తం ఎవరి చేతిలో ఉన్నాయో, దీని వెనుకు మరెవ్వరి హస్తం అయినా ఉండొచ్చన్న సంకేతాలతో, తదుపరి అరెస్టు ఎవరో, తదుపరి ఉచ్చు ఎవర్ని బిగుసుకుంటుందో అన్న చర్చ హోరెత్తుతోంది.
 
ఓ పార్టీ చిహ్నం కోసం రూ.50 కోట్లు ఎరగా వేయడం వెనుక దినకరన్‌ ఒక్కడి హస్తం మాత్రమే ఉండే అవకాశాలు లేవు అని, ఆ పార్టీకి చెందిన వారికి ఈ విషయాలు తెలిసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తమిళనాడులో అర్థరాత్రి  ఘటనలు ఇంకా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దినకరన్ అరెస్టుతో దిమ్మతిరిగింది. ఉన్నఫళాన శశికళ బ్యానర్ల తొలగింపు. మళ్లీ అమ్మకు అందలం