Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తండ్రి గుండె ఆపరేషన్ ఖర్చుల కోసం వేశ్యగా మారిన కుమార్తె? ఎక్కడ?

కన్నతండ్రికి ప్రాణదానం చేసేందుకు కన్నబిడ్డ వేశ్యగా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయవిదారక సంఘటన దుబాయ్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి గుండె జబ్బుతో బాధపడ

తండ్రి గుండె ఆపరేషన్ ఖర్చుల కోసం వేశ్యగా మారిన కుమార్తె? ఎక్కడ?
, గురువారం, 6 ఏప్రియల్ 2017 (16:02 IST)
కన్నతండ్రికి ప్రాణదానం చేసేందుకు కన్నబిడ్డ వేశ్యగా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయవిదారక సంఘటన దుబాయ్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి గుండె జబ్బుతో బాధపడుతూ వచ్చాడు. ఆయనకు ఆపరేషన్ చేయించేందుకు అతని 17 యేళ్ల కుమార్తె దుబాయ్‌లోని తమ బంధువుల ఇంటికి తీసుకెళ్లింది. వారిసాయంతో దుబాయ్‌లోని ఓ ఆస్పత్రి వైద్యులకు చూపిస్తే... ఆపరేషన్ కోసం భారీగా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో 17 యేళ్ల కుమార్తె తన శరీరాన్ని అమ్ముకుని, తండ్రికి ప్రాణదానం చేయాలని నిర్ణయించింది. 
 
అయితే, ఇందుకోసం వరుసకు సోదరి అయ్యే మరో యువతి సహకరించింది. ఆమె ఇచ్చిన సలహా మేరకు... 17 యేళ్ల యువతి వ్యభిచార రొంపిలోకి దిగింది. వ్యభిచారం చేయడం వల్ల రోజుకు 500-600 దిర్హమ్స్ (భారత కరెన్సీ ప్రకారం రూ. 8,847.77) సంపాదించవచ్చని ఆ యువతి నమ్మబలికింది. 
 
అదేసమయంలో ఈ విషయం తండ్రికి ఆ విషయం తెలిస్తే అంగీకరించడని, ఆయన విజిట్ వీసా గడువు ముగిసేంత వరకు వేచి చూసింది. గడువు ముగిశాక, ఆయనను స్వదేశానికి పంపించి, వ్యభిచార వృత్తిలోకి దిగింది. అయితే, ఆమెకు విధి వక్రీకరించి... పోలీసులకు పట్టుబడింది. అనంతరం దుబాయ్ పోలుసులు కోర్టులో ప్రవేశపెట్టారు. 
 
కోర్టులో ఆమె వ్యభిచారం చేసినట్టు ఒప్పుకుంది. తన తండ్రిని రక్షించుకోవడానికే ఆ పనిచేశానని చెప్పింది. తనకు ఇద్దరు వ్యక్తులు సహకరించారని తెలిపింది. ఆ అమ్మాయి తరపున వాదనలు వినిపించేందుకు లాయరు నియమిస్తున్నామని, విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేస్తున్నట్లు జడ్జ్ అల్ షామిసి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్.. మా పార్టీలోకి వచ్చేయండి...? 'గాలి'కి ఆఫరిచ్చిన మహిళ ఎమ్మెల్యే!