Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్.. మా పార్టీలోకి వచ్చేయండి...? 'గాలి'కి ఆఫరిచ్చిన మహిళ ఎమ్మెల్యే!

ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రాజకీయాల్లో వీరిద్దరు వేర్వేరు పార్టీల్లో ఒకే నియోజవర్గానికి పోటీ చేసిన వారే. ఒకాయన రాజకీయాల్లో తలపండిన వ్యక్తి, మరొకరు పార్టీలు మారుతూ ఇప్పుడే స్థిమితంగా ఒక

సర్.. మా పార్టీలోకి వచ్చేయండి...? 'గాలి'కి ఆఫరిచ్చిన మహిళ ఎమ్మెల్యే!
, గురువారం, 6 ఏప్రియల్ 2017 (15:26 IST)
ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రాజకీయాల్లో వీరిద్దరు వేర్వేరు పార్టీల్లో ఒకే నియోజవర్గానికి పోటీ చేసిన వారే. ఒకాయన రాజకీయాల్లో తలపండిన వ్యక్తి, మరొకరు పార్టీలు మారుతూ ఇప్పుడే స్థిమితంగా ఒకే పార్టీలో ఉంటున్నారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. వారే చిత్తూరు జిల్లాకు చెందిన తెదేపా సీనియర్ నేత గాలిముద్దుకృష్ణమనాయుడు, వైకాపా ఎమ్మెల్యే రోజా. వీరు ఇద్దరూ ఇద్దరే.
 
ఎన్నికలకు ముందు గాలిముద్దుకృష్ణమనాయుడు తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేయగా, రోజా వైసిపి తరపున పోటీ చేశారు. ఖచ్చితంగా గెలిచి తీరుతానన్న ధీమాతో ఉన్న ముద్దుకృష్ణమ నాయుడుకు అదే ధీమా ఓడిపోవడానికి కారణమైంది. చాపకింద నీరులా ప్రచారం చేసుకున్న రోజా చివరకు స్వల్ప మెజారిటీతో గెలిచింది. ఆ తర్వాత రోజా అసెంబ్లీకి వెళ్ళడం. ముద్దుకృష్ణమనాయుడుకు ఎమ్మెల్సీ రావడం జరిగిపోయాయి. అయితే పార్టీలో సీనియర్ ఉన్న ముద్దుకృష్ణమనాయుడుకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని అందరూ భావించారు. కొత్త కేబినెట్‌లో ఆయనకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలే తెలిపారు.
 
అయితే ముద్దుకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన మనస్థాపానికి గురై పార్టీ మారాలనుకున్నారట. మొదట్లో జనసేన పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట. కారణం వైసిపి అధినేత జగన్ అంటే ముద్దుకృష్ణమనాయుడుకు అస్సలు పడదు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా తిడుతూనే ఉంటారు. అందుకే ఆ పార్టీలో చేరడం ఇష్టం లేదు. ఉన్న ప్రత్యామ్నాయం జనసేన ఒకటే. అందుకే ఆ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు. కానీ ముద్దుకృష్ణమనాయుడులాంటి సీనియర్ నేత వైసిపిలో ఉంటే మంచిదని రోజా భావించారట. అందుకే రోజా స్వయంగా ముద్దుకృష్ణమనాయుడు కలిసినట్లు సమాచారం.
 
నేరుగా ముద్దును కలిసి వైసిపిలోకి రమ్మని ఆహ్వానించారట. మా పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. పార్టీలో మంచి పదవిని తీసిస్తానని హామీ ఇచ్చిందట. ఎంత శత్రువైనా మట్లాడడానికి వచ్చినప్పుడు కూలంకుషంగా మాట్లాడుకోవాలన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే అన్ని విన్న ముద్దుకృష్ణమనాయుడు తర్వాత మాట్లాడతానని చెప్పారట. మరి వీరిద్దరి మధ్య చర్చలు ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సొంతంగా పార్టీ పెడతా... ఎవరు?