Publish Date: Wed, 11 Mar 2026 (22:27 IST)
Updated Date: Wed, 11 Mar 2026 (22:38 IST)
ఇజ్రాయెల్, అమెరికా బలగాలు గతనెల 28న ఇరాన్‌పై భీకర దాడి చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీజర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. దీనితో ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. ప్రస్తుతం యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యుద్ధం ఆపగలమని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్‌ను అనుకున్నదానికంటే ఎక్కువే నష్టపరిచినట్లు తెలిపారు. ఇకపై తాము ఇరాన్‌లో ఛేదించాల్సిన లక్ష్యాలేమీ లేవని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అతి త్వరలోనే ఇరాన్‌తో యుద్ధానికి చరమగీతం పాడుతామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో యుద్ధంలో మా ప్రణాళిక కంటే ఎక్కువే చేశామని.. ఆరువారాల్లో ముగించాల్సిన విధ్వంసాన్ని.. అంతకంటే ముందుగానే ముగించామని స్పష్టం చేశారు.
మొత్తానికి ఇరాన్‌లో అమెరికా సేనలు ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం సృష్టించాయని ట్రంప్ వెల్లడించారు. అందుకే త్వరలోనే ఇరాన్‌పై యుద్ధాన్ని ముగిస్తామని ట్రంప్ చెప్పుకొచ్చారు.