సౌదీ అరేబియాలోని చమురు బావులపై ఇరాన్ మిస్సైల్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా అగ్రరాజ్యం అమెరికా కన్నెర్రజేసింది. ఫలితంగా ఇరాన్‌పై యుద్ధ గంటలు మోగించింది. దీంతో గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు ఒక్కసారిగా కమ్ముకున్నాయి.
సౌదీ ప్రభుత్వ చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడులతో ఆ దేశం చమురు ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది. యుద్ధం మొదలైతే అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్న అనుమానాలు ఏర్పడటంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 20 శాతం వరకు పెరిగిపోయాయి.
శనివారం డ్రోన్ దాడులు జరిగితే సోమవారం క్రూడ్ ధరలు 12 డాలర్లు పెరిగి 67 డాలర్లకు చేరాయి. 1998 గల్ఫ్ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో చమురు ధరలు పెరగడం ఇదే ప్రథమం. డ్రోన్ దాడికి కారకులెవరో తమకు తెలుసని, సౌదీ అరేబియా మాట కోసం ఎదురు చూస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
యెమన్‌లోని హుతీ(షియా) తిరుగుబాటుదారులు అక్కడి ప్రభుత్వంపై, ఆ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పొరుగుదేశం సౌదీ అరేబియా(సున్నీ)పై ఐదేళ్లుగా యుద్ధం చేస్తున్నారు. తిరుగుబాటుదారులకు షియా దేశమైన ఇరాన్ మద్దతుగా నిలిచింది. తాజా డ్రోన్ దాడులకు పాల్పడింది ఎవరనే స్పష్టత లేదు.
మరోవైపు, భారత్ చమురు అవసరాల్లో 83 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ పరిణామాలు భారత్ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌లో చమురు ధరలు భారీగా పెరనున్నాయి. మున్ముందు పెరుగుదల మరింత ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, భారత్‌కు చమురు కొరత లేకుండా చేస్తామని సౌదీ అరేబియా ప్రభుత్వం హామీ ఇచ్చింది.
సౌదీ ప్రభుత్వరంగ సంస్థ అరామ్‌కో కంపెనీ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ఒకే గ్రేడ్ చమురు సరఫరా చేయలేక పోవచ్చని, వివిధ గ్రేడ్లు అందజేస్తామని చెప్పింది. భారత్‌కు 65 రోజులకు సరిపడా ఆయిల్ రిజర్వులున్నాయు. అవి పూర్తయ్యే లోగా సంక్షోభం సమసిపోతే చమురు ధరలు దిగివస్తాయి. ప్రస్తుతం భారత్ రోజుకు 45 లక్షల బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది.