Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డొనాల్డ్ ట్రంప్ దురుసు+దూకుడు.. నాలుగేళ్లలో యుద్ధం తప్పదు.. సర్వేలో వెల్లడి

అమెరికాకు మాత్రమే తాను అధ్యక్షుడిని అని, ప్రపంచ దేశాలకు కానేకాదని.. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఎన్నికల బరిలో నిలిచినప్పటి నుంచి నేటి వరకు నోటిదురుసు

Advertiesment
డొనాల్డ్ ట్రంప్ దురుసు+దూకుడు.. నాలుగేళ్లలో యుద్ధం తప్పదు.. సర్వేలో వెల్లడి
, శనివారం, 25 ఫిబ్రవరి 2017 (16:43 IST)
అమెరికాకు మాత్రమే తాను అధ్యక్షుడిని అని, ప్రపంచ దేశాలకు కానేకాదని.. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఎన్నికల బరిలో నిలిచినప్పటి నుంచి నేటి వరకు నోటిదురుసు ఓవైపు దూకుడు మరోవైపు అన్న చందంగా దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు ప్రజల వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉంది. అమెరికా ప్రజలకే అవకాశాలిస్తానని.. ఇతర దేశ ప్రజలకు, ముస్లింలకు ఏమాత్రం చోటు ఇవ్వనని చెప్తున్న ట్రంప్‌పై ప్రజా వ్యతిరేకత రోజు రోజుకీ అధికమవుతుందని తాజా సర్వేలో తేలింది. 
 
అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి నెల రోజులు పూర్తయిన సందర్భంగా 'ఎన్‌బీసీ', 'సర్వేమంకీ' నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకత ఏంటో వెల్లడైంది. ఈ సర్వేలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని 53 శాతం మంది పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఆయన పరిపాలనలో ఇబ్బందులు తప్పవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడి అయ్యింది. ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై ట్రంప్ ఆంక్షలు విధించడాన్ని మాత్రం 50 శాతం మంది సమర్థించారు.
 
అంతేగాకుండా ఇంకా నాలుగేళ్లలో అమెరికా పెద్ద యుద్ధంలో పాల్గొనాల్సి రావచ్చునంటూ అత్యధిక శాతం ప్రజలు భావిస్తున్నారని సర్వే పేర్కొంది. 30 శాతం మంది మాత్రం ట్రంప్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, యువతే అత్యధికంగా ట్రంప్‌పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. అమెరికాలో ఐటీ నిపుణులు, ఇంజనీర్లుగా చాలామంది భారతీయులే ఉండటంతో ట్రంప్ ఏ దేశాన్ని లెక్క చేయకుండా తన విధానాలను అమలు చేయడంపై అధికంగా దృష్టి కేంద్రీకరించడంపై ప్రపంచ దేశాలతో పాటు భారతీయులు కూడా గుర్రుగా ఉన్నారు. ముస్లింలపై నిషేధం విధించిన ట్రంప్ ఇండియన్స్‌పై దాడులు, కాల్పులు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా తనదారి రహదారి అన్న చందంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా అమెరికాలో చోటుచేసుకున్న పరిణామాలపై ఎన్నారైలు, ఉన్నత పదవుల్లో ఉన్న భారతీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మతిలేని హింసకు ఈ సమాజంలో స్థానం లేదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు. అమెరికాలో తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిభొట్ల హత్యకు గురవడంపై ఆయన స్పందించారు. శ్రీనివాస్ కుటుంబానికి సానుభూతిని తెలుపుతున్నట్లు వెల్లడించారు.
 
ఇకనైనా ట్రంప్ తీరు మార్చుకుంటే ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ దేశాలను మంచి చేసుకుని.. దేశాభివృద్ధికి పాటుపడాలని.. లేకుంటే ఇబ్బందులు తప్పవని ట్రంప్‌ను రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే నోటికి తాళం వేసి.. దురుసుగా వ్యవహరించకుండా ఉండాలని వారు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యస్... భార్య అభ్యర్థన మేరకు లైంగిక పటుత్వ పరీక్షలు చేయించుకోవాల్సిందే...