Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యస్... భార్య అభ్యర్థన మేరకు లైంగిక పటుత్వ పరీక్షలు చేయించుకోవాల్సిందే...

ఇటీవలి కాలంలో లైంగిక సమస్యలు అధికమవుతున్నాయి. జీవనశైలిలో మార్పులు, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునే పని , ఇది చాలదన్నట్లు తీవ్రమైన మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి, ఒకే రకమైన ఆహారం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు పురుషుడి లైంగిక పటుత్వంపై దెబ్బతీ

Advertiesment
యస్... భార్య అభ్యర్థన మేరకు లైంగిక పటుత్వ పరీక్షలు చేయించుకోవాల్సిందే...
, శనివారం, 25 ఫిబ్రవరి 2017 (16:26 IST)
ఇటీవలి కాలంలో లైంగిక సమస్యలు అధికమవుతున్నాయి. జీవనశైలిలో మార్పులు, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునే పని , ఇది చాలదన్నట్లు తీవ్రమైన మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి, ఒకే రకమైన ఆహారం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు పురుషుడి లైంగిక పటుత్వంపై దెబ్బతీస్తున్నాయి. దీనితో అసలు సమస్య తనలో వున్నదో లేదో తెలుసుకోకుండా పెళ్లి చేసేసుకోవడం ఆ తర్వాత సమస్య తలెత్తినప్పుడు కీచులాడుకోవడం మామూలైంది. ఇలాంటి కేసు ఒకటి హైదరాబాదులో వెలుగుచూసింది.
 
తమ వైవాహిక జీవితంలో మనస్పర్థల వెనుక తన భర్తకు లైంగిక పటుత్వం లేకపోవడమేనని ఓ భార్య పోలీసులను ఆశ్రయించింది. దీనితో పోలీసులు అతడిని లైంగిక పటుత్వ పరీక్షలు చేయించుకుని సమర్థత వుందో లేదో నిరూపించుకోవాలన్నారు. పోలీసుల ఆదేశంపై సదరు యువతి భర్త కోర్టు మెట్లెక్కాడు. ఇది తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమవుతుందని పిటీషన్లో పేర్కొన్నాడు. దీనితో మేజిస్ట్రేట్ కేసును పరిశీలించి కొట్టేశారు. ఐతే పోలీసులు సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశారు. 
 
కేసు వివరాలను పరిశీలించిన సెషన్స్ కోర్ట్, భర్త తప్పకుండా లైంగిక పటుత్వ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. దీనిపై యువతి భర్త హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ అతనికి చుక్కెదురైంది. భార్య అభ్యర్థన నేపధ్యంలో భర్త తప్పక లైంగిక పటుత్వ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని ఉమ్మడి హైకోర్టు స్పష్టీకరించింది. సెషన్స్ కోర్టు ఉత్తర్వులను సమర్థించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్సాస్ ఘటన.. ట్రంప్ పాలసీలతో తలనొప్పే.. న్యూయార్క్ టైమ్స్