Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందమైన మహిళలను ముద్దు పెట్టుకోవాలి... ఈ వ్యాఖ్యలు చేసినందుకు సారీ : డోనాల్డ్ ట్రంప్

డోనాల్డ్‌ ట్రంప్‌ దూకుడు తగ్గించారా? మొన్నటి వరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌ ఇప్పుడు ఆచీ.. తూచీ మాట్లాడుతున్నారా? దూకుడు తగ్గించాలంటూ ప్రత్యర్థులకు హింట్‌ ఇచ్చారా? దీనికి అవుననే విశ్లేషకులు చె

అందమైన మహిళలను ముద్దు పెట్టుకోవాలి... ఈ వ్యాఖ్యలు చేసినందుకు సారీ : డోనాల్డ్ ట్రంప్
, శనివారం, 8 అక్టోబరు 2016 (13:11 IST)
డోనాల్డ్‌ ట్రంప్‌ దూకుడు తగ్గించారా? మొన్నటి వరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌ ఇప్పుడు ఆచీ.. తూచీ మాట్లాడుతున్నారా? దూకుడు తగ్గించాలంటూ ప్రత్యర్థులకు హింట్‌ ఇచ్చారా? దీనికి అవుననే విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ పడుతున్న ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో అందరిని హడలెత్తించేవారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట ఎవరో ఒకరిమీద నోరు పారేసుకోవడం ట్రంప్‌కు అలవాటుగా మారింది. 
 
కాగా ప్రచారంలో అత్యంత దుందుడుకుగా వ్యహరించే ట్రంప్‌ ఒక్కసారిగా దూకుడు తగ్గించి క్షమాపణలు చెప్పారు. ఓ వివాహితపై 2005లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. "అందమైన మహిళలను ముద్దు పెట్టుకోవాలి. ముద్దు మాత్రమే. ముద్దు కోసం నేను ఎంత మాత్రం వేచి చూడను. స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు ఏం చేసినా ఎవరూ ఏమీ అనుకోరు. నిన్ను ముద్దు పెట్టుకోనిస్తారు" అని అన్నారు. 
 
అంతేకాదు, మహిళల కాళ్లు, వాళ్లతో లైంగిక కార్యకలాపాలు ఇలా ట్రంప్ చేసిన వ్యాఖ్యలన్నీ వీడియోలో రికార్డ్ అయ్యాయి. బిల్లీ బుష్‌తో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వీడియోలో ఉంది. అయితే ఆయన చేసిన వాఖ్యలకు వెంటనే ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారు. అమెరికా కాలమానం ప్రకారం అర్థరాత్రి ఒక వీడియోను ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేశారు. తప్పులు చేయకుండా ఉండటానికి తానేమీ అతీతుడిని కాదని ఆ వీడియోలో పేర్కొన్నారు. తన మాటలుగా ప్రచారంలో ఉన్న వీడియో దాదాపు పదకొండేళ్ల క్రితం నాటిదన్నారు. 
 
తనతో సన్నిహితంగా ఉండేవారికి తానెలాంటి వ్యక్తో బాగా తెలుసని వాఖ్యానించారు. కానీ ఈ విషయంలో పూర్తిగా క్షమాపణలు కోరుతన్నానని తెలిపారు. బిల్‌ క్లింటనే గతంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. ఏదేమైనప్పటికీ, ఈ వీడియో ట్రంప్ విజయవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మహిళల నుంచి ట్రంప్‌కు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్ దెబ్బకు గిలగిలా కొట్టుకుంటున్న పాకిస్థాన్ - మిర్చి.. టమోటా అన్నీ బంద్...