Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాపై అమెరికా మీడియా కక్షకట్టింది : డోనాల్డ్ ట్రంప్ అక్కసు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశ మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. ప్రజా మద్దతుతో తాను విజయం సాధిస్తే, దాన్ని అంగీకరించేందుకు మీడియా సిద్ధంగా లేదని ఆయన నిప్పులు చెరిగారు. తన ప్రమాణ స్వీకారోత్సవాని

Advertiesment
Donald trump
, ఆదివారం, 22 జనవరి 2017 (16:18 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశ మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. ప్రజా మద్దతుతో తాను విజయం సాధిస్తే, దాన్ని అంగీకరించేందుకు మీడియా సిద్ధంగా లేదని ఆయన నిప్పులు చెరిగారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలు భారీ ఎత్తున హాజరైతే, తక్కువ మంది వచ్చినట్టు మీడియాలో కథనాలు రావడాన్ని ఆయన తప్పుబట్టారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను పెద్దవిగా చేసి చూపుతున్నారని ఆరోపించారు.
 
వైట్ హౌస్ మీడియా బ్రీఫింగ్ రూము నుంచి తొలిసారిగా మాట్లాడిన ఆయన, జాతీయ మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని మండిపడ్డారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం ఏరియల్ చిత్రాలను, 2009లో ఒబామా ప్రమాణ స్వీకారోత్సవం వేళ హాజరైన వారి ఏరియల్ చిత్రాలను పలు పత్రికలు పక్కపక్కనే ప్రచురించాయి. వీటిని చూస్తుంటే మాత్రం ఒబామా ప్రమాణం చేసిన వేళ అధికులు హాజరైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ ఈ నిజాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరంటూ వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో అమెరికా మీడియాపై ఆయన అక్కసు వెళ్లగక్కారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల్లో గెలిపిస్తే రూ.1.40 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఇస్తాం : అఖిలేష్ యాదవ్