కొత్త చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్.. ఓ సాఫ్ట్ పోర్న్ వీడియోలో ట్రంప్.. నగ్నంగా ఉన్న మహిళతో...?
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు రానున్న తరుణంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ సాఫ్ట్ పోర్న్ వీడియోలో దర్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు రానున్న తరుణంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ సాఫ్ట్ పోర్న్ వీడియోలో దర్శనం ఇవ్వటం అమెరికాలో సంచలనంగా మారింది. మాజీ విశ్వసుందరి ఎలీషియా మచాడో ఓ సెక్స్ టేప్‌లో నటించిందంటూ ఆరోపణలు చేసిన డొనాల్డ్ ట్రంప్ ఊహించనిరీతిలో ఇరుక్కుపోయారు. ఎలీషియాపై ఆరోపణలు చేసిన కొద్ది సమయానికే ట్రంప్ ఉన్న సాఫ్ట్ కోర్ పోర్న్ వీడియో ఆన్‌లైన్‌లో వెలుగుచూసింది.
వివరాల్లోకి ‘డైలీమెయిల్’ కథనం ప్రకారం 2000 సంవత్సరం నాటి ప్లేబోయ్ వీడియో ఒకటి ఆన్‌లైన్ అడల్ట్ వీడియో స్టోర్‌లో లభించింది. చుట్టూ ఉన్న మహిళల్లో జోష్ పెంచుతూ షాంపెన్ బాటిల్ పొంగిస్తూ ఆ వీడియోలో ట్రంప్ కనిపించారు. ఈ వీడియోలో నగ్నంగా ఉన్న మహిళలు లైంగిక చేష్టలకు పాల్పడుతూ కనిపించారు. ''అందం అందమే. న్యూయార్క్‌లో ఏం జరగబోతున్నదో చూద్దాం" అంటూ ఈ వీడియోలో ట్రంప్ పేర్కొన్నారు.
మాజీ మిస్ యూనివర్స్‌ను తాను తిట్టానని అంతా అంటున్నారని, కానీ ఆమె ఒక సెక్స్ టేప్‌లో ఉన్న విషయాన్ని విమర్శకులు చూసుకోవాలని రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే.