Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ బాగానే ఉంది.. వాట్సాప్‌లో జయలలిత జాతకం ఏమంటోంది.. మందులు.. అభిషేకం...?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పదిరోజుల క్రితం జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆరోగ్యంపై గత రెండు రోజుల నుంచి వైద్యులు హెల్త్ బుల

Advertiesment
jayalalithaa
, ఆదివారం, 2 అక్టోబరు 2016 (11:52 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పదిరోజుల క్రితం జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆరోగ్యంపై గత రెండు రోజుల నుంచి వైద్యులు హెల్త్ బులెటిన్‌లు కూడా ఏమీ జారీ చేయకపోవడం అనుమానాలకు తావిచ్చింది.

అన్నాడీఎంకే వర్గాలు గానీ, రాష్ట్ర మంత్రులు గానీ, చివరకు రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు గానీ దీనిపై స్పందించకపోవడం ఏంటని డీఎంకే అధినేత కరుణానిధి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం సాయంత్రం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటించారు. 
 
మరోవైపు అధికార అన్నాడీఎంకె పార్టీ నేతలు కూడా జయమ్మ ఆరోగ్యంపై స్పందిచారు. సీఎం జయలలిత కోలుకుంటున్నారని, ఇంగ్లండ్‌ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక వైద్యుడి పర్యవేక్షణలో చెన్నైలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు అన్నాడీఎంకే తెలిపింది. ఆమె తీవ్ర అస్వస్థతతో ఉన్నట్టు వచ్చిన వదంతులను ఆ పార్టీ కొట్టిపారేసింది. జయలలిత ప్రస్తుత పరిస్థితిని తెలిపేందుకు ఫొటోలు విడుదల చేయాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చింది. ‘అమ్మ కోలుకుంటున్నది. త్వరలోనే ఆమె డిశ్చార్జ్‌ అవుతారని భావిస్తున్నట్లు తెలిపింది.
 
మరోవైపు తమిళనాడు సీఎం ఆరోగ్య పరిస్థితిపై వాట్సప్ గ్రూప్‌లో పెద్ద చర్చ సాగుతోంది. జయలలిత జాతకం ప్రకారం.. అనారోగ్య సమస్యలకు మందులు తీసుకుంటే ఆమె త్వరలోనే కోలుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అన్నాడీఎంకేకు చెందిన ఓ వాట్సప్ గ్రూపులో జయలలిత గురువు దృష్టిని రాహువు అడ్డుకుంటున్నాడు. దీంతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడినా.. మందులతో సరిచేయబడుతాయని చెప్తున్నారు. 
 
గురువుకు త్రికోణంలో గోచార రాహు ప్రభావం ఉండటంతో శ్వాస సమస్యలు ఏర్పడ్డాయని.. కానీ గురువు ప్రభావం శుక్రునిపై పడటంతో మందులు తీసుకుంటే ఆమె పూర్తిగా కోలుకుంటుందని.. ఇంకా పరిహారాలు చేస్తే.. ఆమె పూర్తిగా కుదుటపడతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గురు భగవానుడు.. లివర్, శ్వాస సంబంధిత అవయవాలకు అధిపతి అందుకే ఆమెకు శ్వాస సమస్యలు ఏర్పడ్డాయని చెప్తున్నారు.

శుక్రవారం మహాలయ అమావాస్యకు తర్వాత రాహుకు అధిదేవత అయిన.. దక్షిణ దిశలో గల కాళీ మాతకు పాలాభిషేకం చేయిస్తే ఆమె అనారోగ్యం నుంచి బయటపడతారు. అదీ అమావాస్యకు తర్వాత 9 రోజుల్లో ఈ అభిషేకం చేయించాలని జ్యోతిష్యులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐరాసలో ఉగ్రవాదులను వెనకేసుకొచ్చారు.. పనామా గండం.. నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు..