Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికన్లకు వారి ఉద్యోగాలు వారికి దక్కేందుకు చేయగలిగినదంతా చేస్తా: ట్రంప్‌

అమెరికన్లకు వారి ఉద్యోగాలు వారికి దక్కేందుకు చేయగలిగినదంతా చేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశాు. ‘‘అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకోవాలి, అమెరికా ఉత్పత్తులనే కొనాలి’’- అనేది తన

అమెరికన్లకు వారి ఉద్యోగాలు వారికి దక్కేందుకు చేయగలిగినదంతా చేస్తా: ట్రంప్‌
, ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (15:27 IST)
అమెరికన్లకు వారి ఉద్యోగాలు వారికి దక్కేందుకు చేయగలిగినదంతా చేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశాు. ‘‘అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకోవాలి, అమెరికా ఉత్పత్తులనే కొనాలి’’- అనేది తన తారక మంత్రమని పునరుద్ఘాటించారు. ‘‘వాణిజ్య నిబంధనలను పక్కాగా అమలు చేస్తాం. ఇతర దేశాల మోసపూరిత చర్యలను అడ్డుకుంటాం. అమెరికాలోని కర్మాగారాల్లో ఇక్కడి కార్మికులు తయారుచేసే ఉత్పత్తులే దేశానికి కావాలి’’ అని వ్యాఖ్యానించారు. 
 
తాజాగా బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘‘నవంబరు నుంచి దేశంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. వేల కొద్దీ ఉద్యోగాలు తిరిగి వస్తున్నాయి. ఫోర్డ్‌, జనరల్‌ మోటార్స్‌ తదితర కంపెనీలు ఇక్కడే కర్మాగారాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడే ఉద్యోగాలు ఇస్తున్నాయి. అరిజోనా రాష్ట్రంలో కొత్త ప్లాంటు తెరుస్తామని, అందులో 10 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ఇన్‌టెల్‌ సంస్థ ప్రకటించింది. 
 
దేశంలో వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నారు. నేను దేశాధ్యక్షుడు కావడానికి దోహదం చేసిన ప్రధానాంశాల్లో అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తాననే హామీ ఒకటి. దీని అమలులో ప్రజలను నిరాశపరచబోను. ఉద్యోగాల కల్పనపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాను. దేశ పౌరులకు మరిన్ని ఉద్యోగాలు, మెరుగైన వేతనాలు దక్కేలా కృషి చేస్తా. అమెరికాను ఇకపై ఎవ్వరూ ఏ విధంగా అలుసుగా తీసుకోకుండా చేస్తా’’ అని ట్రంప్‌ ఉద్ఘాటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీఎంకే దేశ ద్రోహులు కంటే.. శశికళ వంటి అవినీతిపరులు బెస్ట్ : సుబ్రమణ్య స్వామి