Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిజ్జా డెలివరీలో డొమినోస్ కొత్త టెక్నిక్.. ధ్రువపు జింకపై మోసుకెళ్లి డెలివరీ.. సక్సెస్ అవుతుందా?

పిజ్జా డెలివరీ విషయంలో డొమినోస్ సంస్థ కొత్త కొత్త టెక్నిక్స్ కనిపెడుతోంది. పిజ్జా డెలివరీపై వెరైటీలు అమల్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే డ్రోన్ సాయంతో పిజ్జాలు డెలివరీ చేసి సక్సెస్ అయిన డొ

Advertiesment
Domino's training reindeer to deliver pizzas in Japan
, శనివారం, 26 నవంబరు 2016 (11:40 IST)
పిజ్జా డెలివరీ విషయంలో డొమినోస్ సంస్థ కొత్త కొత్త టెక్నిక్స్ కనిపెడుతోంది. పిజ్జా డెలివరీపై వెరైటీలు అమల్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే డ్రోన్ సాయంతో పిజ్జాలు డెలివరీ చేసి సక్సెస్ అయిన డొమినోస్.. త్వరలో రెయిన్‌డీర్‌ (ధ్రువపుజింక) ద్వారా పిజాను డెలీవరి చేస్తామని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 
 
జపాన్‌లో ఈ ఏడాది కాస్త చలి ఎక్కువగా ఉంటుందని స్థానిక వాతావరణ సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జపాన్‌లోని హొకైడో ద్వీపంలో రోడ్లపై మంచు పేరుకుపోయినా, ఎంత చలి ఉన్నా ధ్రువపు జింకల సాయంతో పిజాలు డెలివరీ చేయాలని డొమినోస్‌ నిర్ణయించుకుంది.
 
ఈ విషయం విన్న ప్రతిఒక్కరూ ఇదంతా పబ్లిసిటీ కోసం చేసిన ప్రకటన మాత్రమేనని అమలు చేయడం సాధ్యం కాదని చెప్తున్నారు. ఈ విషయాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్న డొమినోస్‌.. ఇప్పటికే ధ్రువపు జింకలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ధ్రువపు జింకలు ఎంత బరువు మోయగలవు? బరువుతో ఎంత దూరం ప్రయాణించగలవన్న విషయాలను జంతు సంరక్షణ నిపుణుల ద్వారా తెలుసుకొని శిక్షణ ప్రారంభించారు. మరి ఈ ప్రయోగం ఏమేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ సంబంధాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. వివాహేతర సంబంధాలను క్రూరత్వం అని చెప్పలేం..