Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డోనాల్డ్ ట్రంప్‌తో పడక గదిలో ఉన్న మాట నిజమే : శృంగార తార

Advertiesment
Stormy Daniels

ఠాగూర్

, బుధవారం, 8 మే 2024 (18:44 IST)
అమెరికా శృంగార తార స్టార్మీ డేనియల్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఏకాంతంగా గడిపిన మాట నిజమేనని వెల్లడించారు. పైగా, ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్ అడ్డదారులు తొక్కారనే ఆరోపణలపై విచారణ జరుగుతోన్న క్రమంలో న్యూయార్క్ కోర్టులో ఆమె వాంగ్మూలం ఇచ్చారు.
 
'2006లో జరిగిన ఓ గోల్ఫ్ టోర్నమెంట్ సమయంలో ట్రంప్‌ను తొలిసారి కలిశా. ఆ తర్వాత ఓ బాడీగార్డ్ ద్వారా నన్ను డిన్నర్‌కు ఆహ్వానించారు. అనంతరం హోటల్ సూట్‌కు తీసుకెళ్లారు. ఆయన ఉద్దేశం ఏంటో అర్థమైంది. అక్కడ ఇద్దరం ఏకాంతంగా గడిపాం. ఆ తర్వాత పలుమార్లు భేటీ అయినప్పటికీ సన్నిహితంగా మెలగలేదు. మా సంబంధం గురించి ఎంతోమందికి తెలుసు' అని డేనియల్ వివరించారు.
 
2011లో ఓ బ్లాగ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చిందని, 2016 ఎన్నికల సమయంలో 1,30,000 డాలర్ల మొత్తాన్ని ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ నుంచి స్వీకరించానని శృంగార తార తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే, ట్రంప్ నుంచి డబ్బులు వసూలు చేయడం తన ఉద్దేశం కాదన్నారు. 
 
మరోవైపు, శృంగారతార చేసిన ఆరోపణలను ట్రంప్ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. కేవలం డబ్బుల కోసమే మాజీ అధ్యక్షుడిపై ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించారు. ఇలా సుదీర్ఘ సమయం ఇరు పక్షాల వాదనలు కొనసాగాయి. హష్ మనీకి సంబంధించిన కేసుపై న్యూయార్క్ న్యాయస్థానం కొన్ని రోజులుగా విచారణ చేస్తోంది. 13వ రోజు వాదనలు కొనసాగాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తను మంచానికి కట్టేసి దుస్తులు విప్పి అక్కడ సిగరెట్‌తో కాల్చిన భార్య, ఆ తర్వాత?